Eugene Shoemaker: చంద్రుడిపై మనిషి సమాధి.. భర్త కల నెరవేర్చిన భార్య!

ఆ వ్యక్తి ఎన్నడూ ఆస్ట్రోనాట్ గా మారలేదు.. చంద్రుడిపై కాలు మోప లేదు.. అయినా ఆయన సమాధి చంద్రుడిపై ఉంది? అదెలా సాధ్యమైంది? అనేది తెలియాలంటే.. ఈ కథనం మొత్తం చదవాల్సిందే.

  • Written By:
  • Publish Date - July 8, 2022 / 09:00 AM IST

ఆ వ్యక్తి ఎన్నడూ ఆస్ట్రోనాట్ గా మారలేదు.. చంద్రుడిపై కాలు మోప లేదు.. అయినా ఆయన సమాధి చంద్రుడిపై ఉంది? అదెలా సాధ్యమైంది? అనేది తెలియాలంటే.. ఈ కథనం మొత్తం చదవాల్సిందే.

చిన్నప్పటి నుంచి ఒకే కల..

ఆయన పేరు యూజీన్ షూమేకర్.. అమెరికాకు చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త. అమెరికాలో సైంటిస్టులకు ఇచ్చే “నేషనల్ మెడల్” ను నాటి అధ్యక్షుడు బుష్ చేతుల మీదుగా యూజీన్ షూమేకర్ అందుకున్నారు. అంతటి పేరు ప్రఖ్యాతులు గడించిన ఆయన .. నాసా అపోలో మిషన్ ద్వారా చంద్రుడిపైకి వెళ్లే వ్యోమ గాములకు అక్కడి వాతావరణ పరిస్థితుల గురించి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. చిన్నప్పటి నుంచి యూజీన్ షూమేకర్ కు సైతం చంద్రుడి పైకి పోవాలనే కల ఉండేది. దీన్ని నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు. వ్యోమగాముల కోసం అప్పట్లో నాసా పెట్టిన పరీక్షలు రాశారు. వాటిలో పాస్ అయినప్పటికీ.. ఆరోగ్య సంబంధిత కారణాల రీత్యా యూజీన్ షూమేకర్ ను నాసా ఎంపిక చేయలేదు. దీంతో ఆయన చాలా బాధపడ్డారు. అయినా తోక చుక్కలు, ఆస్టరాయిడ్స్ పై తన పరిశోధనలు కొనసాగించారు. దాదాపు 20 తోక చుక్కలు, 800 ఆస్టరాయిడ్స్ ను గుర్తించారు. ఈ పరిశోధనల క్రమంలోనే 1997 సంవత్సరంలో అమెరికా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన యూజీన్ షూమేకర్.. ఓ అగ్ని పర్వతంపై అధ్యయనం చేశారు. 1997 జులై 28న ఆస్ట్రేలియాలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన మృతిచెందారు.

భార్య ప్రయత్నంతో..

మరుసటి ఏడాది యూజీన్ షూమేకర్ భార్య నేరుగా నాసా కార్యాలయానికి వెళ్లి ఉన్నతాధికారులతో కలిసింది. తన భర్త యూజీన్ షూమేకర్ అమెరికా సైన్స్ రంగానికి చేసిన సేవలను వివరించింది. చంద్రుడిపైకి కాలు మోపాలని చిన్నప్పటి నుంచి ఆయన కలలు కనేవారని చెప్పి భావోద్వేగానికి గురైంది. ఆమె విజ్ఞాపన మేరకు 1998 జనవరి 6న చంద్రుడి పైకి వెళ్లిన నాసా మిషన్ తో యూజీన్ షూమేకర్ చితా భస్మాన్ని పంపారు. చంద్రుడిపై దిగిన వ్యోమగాములు యూజీన్ షూమేకర్ చితా భస్మాన్ని చంద్రుడిపై ఖననం చేశారు. దీంతో చంద్రుడి పై ఖననం ఆయిన తొలి మనిషిగా యూజీన్ షూమేకర్ నిలిచారు. 2019 సంవత్సరం లో ఎలొన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ మిషన్ ద్వారా 156 మంది చితా భస్మాలను చంద్రుడిపైకి పంపారు.