Site icon HashtagU Telugu

The Bear House Store : హైదరాబాద్‌లో నూతన స్టోర్‌ను ప్రారంభించిన ది బేర్ హౌస్ స్టోర్ !

The Bear House Store opens a new store in Hyderabad!

The Bear House Store opens a new store in Hyderabad!

The Bear House Store : ఇటీవల ప్రసారమైన షార్క్ ట్యాంక్ సీజన్ 4 ఎపిసోడ్ తర్వాత చర్చనీయాంశమైన స్మార్ట్ కాజువల్స్‌లో ప్రత్యేకత కలిగిన సమకాలీన పురుషుల దుస్తులు మరియు ఉపకరణాల బ్రాండ్ అయిన ది బేర్ హౌస్, ఇప్పుడు హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో తమ రెండవ ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ నగరంలోని బ్రాడ్‌వేలో కూడా తమ స్టోర్ ను కలిగి ఉంది. ఈ స్టోర్ బ్రాండ్ యొక్క మొట్టమొదటి హై స్ట్రీట్-కమ్ మాల్ రిటైల్ అవుట్‌లెట్, ఇది వ్యూహాత్మకంగా హైదరాబాద్‌లోని అత్యంత ప్రీమియం షాపింగ్ గమ్యస్థానాలలో ఒకటైన బంజారా హిల్స్‌లో ఏర్పాటు చేయబడింది.

Read Also: LPG cylinder price Hike : దేశ వ్యాప్తంగా గ్యాస్‌ ధరలు పెంపు

వ్యూహాత్మకంగా బయటి నుండి నేరుగా మాల్‌లో ఉన్న స్టోర్ కు చేరుకునేలా ఏర్పాట్లు కలిగిన, 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ , ది బేర్ హౌస్ యొక్క సిగ్నేచర్ బేర్ కేవ్ డిజైన్‌ను కలిగి ఉంది, ఇది దాని బెంగళూరు స్టోర్ లే అవుట్‌ను ప్రతిబింబిస్తుంది. ఎలుగుబంటి గుహ నుండి ప్రేరణ పొందిన ఈ స్టోర్ మట్టి సువాసనలు మరియు ఆహ్లాదకరమైన రంగులతో ఆకట్టుకోనుంది. ఈ స్టోర్‌లో ది బేర్ హౌస్ యొక్క ప్రీమియం స్మార్ట్-క్యాజువల్ శ్రేణి యొక్క ప్రత్యేకమైన కలెక్షన్ ఉంటుంది, వీటిలో షర్టులు, బాటమ్స్, పోలోస్, స్వెట్‌షర్టులు, డెనిమ్‌లు మరియు యాక్ససరీలు ఉంటాయి, ఇవి పురుషులు ప్రతిచోటా వెళ్లగలరని, ప్రతిదీ సులభంగా చేయగలరని నిర్ధారిస్తాయి.

“ది బేర్ హౌస్ యొక్క ఆన్‌లైన్ అమ్మకాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మార్కెట్‌లలో హైదరాబాద్ ఒకటి. ఈ ఆఫ్‌లైన్ విస్తరణ బ్రాండ్‌కు సహజమైన పురోగతి. నగర ప్రజలు మా సిగ్నేచర్ షర్టులు, ఆకర్షణీయమైన లినెన్ మరియు డెనిమ్ పీస్ లను కలిగి ఉన్న బ్రాండ్‌ యొక్క తాజా కలెక్షన్ ను ప్రత్యక్షంగా వీక్షించి , అనుభూతులను పొందగలరని ఆశిస్తున్నాము. ఎల్లప్పుడూ ప్రయాణాలలో వుండే , సౌకర్యం , శైలి రెండింటినీ కోరుకునే పురుషుల కోసం ఈ కలెక్షన్ రూపొందించబడింది ”అని ది బేర్ హౌస్ సహ వ్యవస్థాపకుడు హర్ష్ సోమయ్య అన్నారు.

బంజారా హిల్స్ స్టోర్‌ను ప్రారంభించడంతో, ది బేర్ హౌస్ కేవలం రిటైల్ ప్రాంగణం కంటే ఎక్కువ పరిచయం చేస్తోంది – ఇది శైలి, సౌకర్యం , అధునాతనతకు విలువనిచ్చే పురుషుల కోసం ‘డెన్’ను సృష్టిస్తోంది. బ్రాండ్ వృద్ధి చెందుతూనే ఉన్నందున, నాణ్యత, వైవిధ్యత మరియు లీనమయ్యే షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ఇది కట్టుబడి ఉంది.

ఈ విస్తరణతో, ది బేర్ హౌస్ తన ఆఫ్‌లైన్ కార్యకలాపాలను మరింత మెరుగుపరుచుకుంది, బెంగళూరులోని భారతీయ మాల్‌లో దాని మొదటి ప్రత్యేకమైన బెంగళూరు స్టోర్‌ను ఈ స్టోర్ గుర్తుకు తీసుకురానుంది. ది బేర్ హౌస్ బ్రాడ్‌వే – హైదరాబాద్ మరియు న్యూఢిల్లీలలో కూడా ఉంది. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని , ది బేర్ హౌస్ మొదటి నెల పాటు వాక్-ఇన్ కస్టమర్లకు ఫ్లాట్ 25% తగ్గింపును అందిస్తోంది.

Read Also: GRMB Meeting: గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధాన చర్చ…