Baby In Oven : కన్నబిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి అల్లాడిపోతుంది. అలాంటిది ఓ తల్లి తన బిడ్డను ఊయలకు బదులుగా ఓవెన్‌లో పడుకోబెట్టింది. దీంతో తీవ్రంగా కాలిన గాయాలై పసికందు అక్కడిక్కడే చనిపోయింది. ఈ దారుణ ఘటన అమెరికాలోని మిస్సౌరిలో ఉన్న కనాస్ నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన మాతృత్వానికి మచ్చ(Baby In Oven) తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
అసలేం జరిగింది ?
కనాస్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ పసికందు ఊపిరాడక అపస్మారక స్థితిలో ఉందంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ చిన్నారిని పరిశీలించగా కాలిన గాయాలతో అప్పటికే మరణించింది. దీనిపై పసికందు తల్లి మరియా థామస్‌ను ప్రశ్నించగా.. విస్తుపోయే వాస్తవాన్ని పోలీసులకు చెప్పింది. పసికందును నిద్ర పుచ్చేందుకు ఊయలకు బదులుగా పొరపాటున ఓవెన్‌లో పెట్టినట్లు పోలీసులకు చెప్పింది. ఈ పొరపాటు ఎలా జరిగిందన్న విషయంపై పోలీసులకు వివరణ ఇవ్వలేదు. మరియా థామస్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఓ పసికందు జీవితాన్ని కోల్పోయిన ఈ విషాద ఘటనను తమను ఎంతో బాధించిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని న్యాయ వ్యవస్థ కఠినంగా శిక్షిస్తుందని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.
Also Read : Bed Vastu : బెడ్ కింద ఇవి పెట్టారో.. మీ ఇంట్లో అలా జరుగుతుంది!
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ పసికందును..
నల్లగొండ జిల్లా కేంద్రంలో మానవత్వం మంట కలిసింది. అప్పుడే పుట్టిన పసికందు మృతదేహాన్నితండ్రి రైల్వే ట్రాక్ మీద వదిలి వెళ్లాడు. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి నార్కట్ పల్లి మండలంలోని తొండల్వాయి గ్రామానికి చెందిన నవిత గత పది రోజుల క్రితం వచ్చారు. ఈమెకు ఇద్దరు కవలలు జన్మించారు. ఇద్దరూ అమ్మాయిలే. అనంతరం నిన్న సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పాన చనిపోయింది. దాంతో తండ్రి శేఖర్ పాప మృతదేహాన్ని నల్లగొండలోని పానగల్లు బ్రిడ్జి కింద ఉన్న రైల్వే ట్రాక్ పై వదిలి వెళ్లాడు. గత శనివారం ఉదయం రైల్వే ట్రాక్ మాన్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ కె.సాలకమ్మ, హెడ్ కానిస్టేబుల్ డి.రజిత సంఘటన స్థలానికి చేరుకొని పాప మృతదేహాన్ని నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది ఆ పాప నిన్న సాయంత్రం మే చనిపోయింది అని తెలపడంతో తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నారు. పాప తండ్రి శేఖర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.