Site icon HashtagU Telugu

Dinosaur Extinction : డైనోసార్ల అంతం గుట్టురట్టు.. 80.9 కిలోమీటర్ల భారీ గ్రహశకలం ఢీకొనడం వల్లే..!!

dinosaur tracks in Poland

dinosaur tracks in Poland

బలమైన సరీసృపాలుగా పేరొందిన డైనోసార్లను అంతం చేసేలా ఏం జరిగింది ? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో డైనోసార్ల అంతానికి దారితీసిన ఒక విపత్కర పరిణామానికి సంబంధించిన పలు వివరాలు వెలుగు చూశాయి.

ఏం జరిగింది ?

అది 6.5 కోట్ల ఏళ్ల కిందటి మాట. అప్పట్లో భూమిపై ఎక్కడ చూసినా డైనోసార్ లే ఉండేవి. ఆ సమయంలో ఒక భారీ గ్రహ శకలం భూమిని ఢీకొట్టింది. దాని వ్యాసం (డయామీటర్) ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 80.9 కిలోమీటర్లు. ఇంత భారీ గ్రహ శకలం వేగంగా ఆకాశం నుంచి దూసుకొచ్చి.. మెక్సికో లోని చిక్సులుబ్ ప్రాంతంలో పడింది. దాని ధాటికి ప్రళయం వచ్చిందా అన్నట్టుగా భూమి దద్దరిల్లింది. గ్రహ శకలం ఢీకొనడంతో ఏర్పడిన కుదుపు ధాటికి చుట్టుపక్కల దాదాపు 140 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నడుమ డైనోసార్ల అంతం జరిగిందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆ గ్రహ శకలం మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య ప్రాంతం నుంచి భూమిపైకి దూసుకొచ్చిందని చెప్పారు. 25 కోట్ల ఏళ్ల తర్వాత మరోసారి భూమిని ఇలాంటి గ్రహ శకలం ఢీకొనే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. అయితే అప్పటికే వాటిని ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.