Site icon HashtagU Telugu

Terrorist attack : ఉగ్రదాడి..ఈ సంఘటన దురదృష్టకరం: సీఎం ఒమర్‌ అబ్దులా

Terror attack..this incident is unfortunate: CM Omar Abdullah

Terror attack..this incident is unfortunate: CM Omar Abdullah

CM Omar Abdullah : జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించారు. ఈ సంఘటన దురదృష్టకరమని అభివర్ణిస్తూ.. ఒమర్‌ అబ్దులా తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్‌లు ఎక్కువగా జరుగుతన్నాయి. శ్రీ నగర్‌లోని సండే మార్కెట్ వద్ద ఈ రోజు అమాయక దుకాణదారులపై గ్రెనేడ్ దాడికి సంబంధించిన వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమాయక పౌరులను టార్గెట్ చేయడాన్ని సమర్థించలేం. ప్రజలు ఎలాంటి నిర్భయంగా జీవించేందుకు వీలుగా ఈ దాడులను వీలైనంత త్వరగా ముగించేందుకు భద్రతా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేయాలి. అని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దులా పోస్ట్‌లో తెలిపారు.

కాగా, శ్రీనగర్‌ సండే మార్కెట్‌లోని టూరిస్ట్‌ సెంటర్‌ ఆఫీస్‌ పై ఉగ్రవాదులు గ్రనేడ్‌లు విసిరారు. ఈ దాడిలో పది 12 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీఆర్‌సీ సమీపంలో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్‌ విసిరారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నది. అందరికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. దాడి సంఘటన జరిగిన వెంటనే, ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడికి సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు వేగంగా స్పందించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also : HYD: దీపావళి రోజున గాంధీ విగ్రహానికి ఘోర అవమానం