Site icon HashtagU Telugu

IAS 10th Marks:నెట్టింట్లో వైరల్ అవుతున్న కలెక్టర్ మార్క్ షీట్.. సక్సెస్ స్టోరీ తెలిస్తే వావ్ అనాల్సిందే!

Collector Successful Story

Collector Successful Story

మామూలుగా బాగా మార్కులు వచ్చి ర్యాంకులు సాధించిన వారితో పోల్చుకుంటే జస్ట్ పాస్ మార్కులు వచ్చిన విద్యార్థులు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇదే విషయమే ఎన్నో సందర్భాలలో ఎందరో విషయంలో రుజువయింది కూడా. కాగా ఇప్పుడు అలాంటి జాబితాలో ఛత్తీస్గడ్ కు చెందిన ఒక కలెక్టర్ ఉన్నారు. ఇది ఛత్తీస్గడ్ కు చెందిన ఒక కలెక్టర్ థర్డ్ క్లాస్ లోనే పాస్ అయ్యి ప్రస్తుతం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారట. మరి ఆ కలెక్టర్ ఎవరు? ఆ కలెక్టర్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి?అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చత్తీస్గడ్ కేడర్ 2009 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అవినాష్ శరణ్ తాజాగా విద్యార్థులలో ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి తన పదవ తరగతి మార్కులు చేసిన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే మొదట ఈ మార్క్ షీట్ ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అవినాష్ శరణ్ మూడవ తరగతి లోనే పదవ తరగతి పాసయ్యాడు. కాగా నేడు ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నత పదవిని చేపట్టి తన సేవలను అందిస్తున్నారు. చతిస్గడ్ ఐఏఎస్ అధికారి అవనిష్ తాజాగా పదవ తరగతి మార్క్ షీట్ ని తన ట్విట్టర్ కాదా ద్వారా పంచుకున్నారు. ఆ మార్క్ షీట్లో 1996లో బీహార్ స్కూల్లో ఎగ్జామినేషన్ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 700 మార్కులకు గాను 314 మార్కులు మాత్రమే వచ్చాయి.

 

అంటే 44.5% మార్కులతో మాత్రమే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించారు. అయితే గణితంలో 31 మార్కులకు పాస్ మార్కులు కాగా అవనీష్ 31 మార్కులు వచ్చాయి. అయితే శరణ్ మార్కుల ఆధారంగా రాసినప్పటికీ యు.పి.ఎస్.సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. మార్కులను చూసి ఒక వ్యక్తి సామర్థ్యాన్ని కొలవలేవని కామెంట్ తో మార్కుల షీట్ ను షేర్ చేశారు. కాగా ఆయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే..లాంతరి వెలుతురుతో చదువుకునేవాడిని అని తెలిపారు. కాగా అవనీష్ ది బీహార్ లోని సమస్తిపూర్ జిల్లా కేవటా గ్రామం. అతని తండ్రి తాత ఇద్దరు కూడా ఉపాధ్యాయులట.