AP News: అక్కడ మూడు నెలల పాటు కోళ్ల పెంపకంపై తాత్కాలిక నిషేధం, కోట్లలో నష్టం

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 05:52 PM IST

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు,7 లక్షల పెరటి కోళ్లు పెంపకం జరుగుతుండగా.. ఏటా రూ. 800 కోట్ల మేర పౌల్ట్రీ బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి 37, 089 మెట్రిక్ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హేచరీస్ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజువారీగా రూ. 5 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని రెండు గ్రామాల్లో ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా కలకలం రేపింది. ఈ రెండు ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ షాపులను పోలీసులు మూసివేశారు.

ఈ రెండు కేంద్రాల్లో మూడు నెలల పాటు కోళ్ల పెంపకంపై తాత్కాలిక నిషేధం ఉందని, ఆ తర్వాత 10 నుంచి 20 కోళ్ల పెంపకానికి అనుమతిస్తామని తెలిపారు.ఏవియన్ ఇన్ఫ్లుఎంజా, సాధారణంగా బర్డ్ ఫ్లూ అని పిలుస్తారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది కాని అప్పుడప్పుడు మనుషులకు, ఇతర జంతువులకు వ్యాపిస్తుంది.

ఇది అడవి పక్షులలో సహజంగా సంభవించే ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల వస్తుంది. జనాలకు వ్యాప్తి సాధారణంగా సోకిన పక్షులు లేదా వాటి విసర్జనలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వస్తుంది. జనాల్లో తేలికపాటి శ్వాసకోశ అనారోగ్యం మొదలుకొని న్యుమోనియాకు దారితీస్తుంది.ఒక్కొసారి చనిపోవచ్చు కూడా. ఇక మానవులలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి ఉండవచ్చు.