Climate Havoc: ఎండవేడికి కరిగిపోయిన రైల్వే సిగ్నల్స్.. ఇక అక్కడ మనుషుల పరిస్థితి ఏంటో?

సాధారణంగా ఎండాకాలంతో పోల్చుకుంటే వర్షాకాలం చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతూ ఉంటాయి.

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 05:45 AM IST

సాధారణంగా ఎండాకాలంతో పోల్చుకుంటే వర్షాకాలం చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతూ ఉంటాయి. ఇక ఎండాకాలంలో సాధారణంగా 35 డిగ్రీ సెల్సియస్ ఆ పైననే ఉంటుంది. ఇక భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అయితే 40 డిగ్రీ సెల్సియస్ పైనే వేడి నమోదు అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అధిక సంఖ్యలో కూడా వేడి నమోదు అవుతూ ఉంటుంది. కాగా తాజాగా ఒక ప్రదేశంలో ఏకంగా ఎండ వేడికి రైల్వే సిగ్నల్స్ ఏ కరిగిపోయాయి. అయితే ఏకంగా రైల్వే సిగ్నల్స్ కరిగిపోయాయి అంటే అక్కడ మనుషుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అక్కడ ప్రజల పరిస్థితి ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

యూరప్ లోని పలు దేశాల్లో కార్చిచ్చు చెలరేగింది. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, క్రొయేషియా అంతటా చెలరేగిన కార్చిచ్చుల కారణంగా తీవ్రమైన వేడిగాలులతో ఉష్ణోగ్రత భారీగా పెరిగింది. యూకేలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగాయి. ఫలితంగా పలు రైలు సిగ్నల్స్ దెబ్బతింటున్నాయి. వేడి, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా యూకే నేషనల్ రైల్వేస్ అధికారిక ట్విట్టర్ కొన్ని పోస్టులు పోస్ట్ చేశారు. వేడితో రైలు సిగ్నలింగ్ పరికరాల కాలిపోయిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ రోజు ఈస్ట్ కోస్ట్ మెయిన్ లైన్‌లో ప్రయాణించే ముందు మీ ప్రయాణాలను తనిఖీ చేయమని కూడా మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఎందుకంటే మేము తీవ్ర అంతరాయాన్ని ఆశిస్తున్నాము.

 

పీటర్‌బరో, లండన్ కింగ్స్ క్రాస్ మధ్య మార్గంలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మేము లైన్‌ను రిపేర్ చేస్తున్నాము అని పోస్ట్ లో పేర్కొన్నారు.జార్జ్ ఫోరాక్రెస్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన మరో పోస్ట్‌లో మండుతున్న వేడి కారణంగా భవనం లోపల ఫైర్ స్ప్రింక్లర్లు యాక్టివేట్ అవుతున్నట్లు చూపించారు. దేశంలో తొలిసారిగా ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, రెండు రోజుల పాటు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీనితో అక్కడి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. అయితే రైల్వే సిగ్నల్స్ ఆ వేడికి కరిగిపోయాయి అంటే అక్కడి పరిస్థితులు ఎంతగా దారుణంగా భయంకరంగా ఉన్నాయి అర్థం చేసుకోవచ్చు.