Site icon HashtagU Telugu

Telugu Toppers : సివిల్స్ లో తెలుగోళ్ల తడాఖా.. మూడో ర్యాంక్ మనదే

Telugu Toppers

Telugu Toppers

సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజాలు (Telugu Toppers) సత్తా చాటారు. ఏకంగా  సివిల్స్ ఆలిండియా  3వ ర్యాంక్ ను తెలంగాణకు చెందిన నూక‌ల ఉమా హార‌తి సాధించారు. ఈమె నారాయ‌ణపేట ఎస్పీ నూక‌ల వెంక‌టేశ్వ‌ర్లు కుమార్తె. వారి స్వ‌స్థ‌లం సూర్యాపేట జిల్లాలోని హుజుర్‌న‌గ‌ర్. ఇక ఉమ సోద‌రుడు సాయి వికాస్ 2021లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో 12 వ ర్యాంకు సాధించి.. ట్రైనింగ్ పూర్తి కావడంతో ఈ నెలలోనే డ్యూటీలో చేరారు. తిరుపతికి చెందిన బీవీఎస్‌ పవన్‌ దత్తా సివిల్స్ ఫలితాల్లో  22వ ర్యాంకు (Telugu Toppers) సాధించారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లం గుంటూరుప‌ల్లికి చెందిన శాఖ‌మూరి శ్రీసాయి హ‌ర్షిత్ 40వ ర్యాంకు, పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిధిలోని సుల్తానాబాద్ మండ‌లానికి చెందిన ఆవుల సాయికృష్ణ 94 వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు.

నూక‌ల ఉమాహార‌తి సివిల్స్ మూడో ర్యాంకు

హ్యాట్సాఫ్ రేవయ్య 

కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడకు చెందిన డోంగ్రి రేవయ్య 410వ ర్యాంక్ పొందారు. రేవ‌య్య ఇంట‌ర్ వ‌ర‌కు గురుకుల విద్యాసంస్థ‌ల్లోనే చదువుకున్నారు. ఐఐటీ మ‌ద్రాసులో బీటెక్ చేశారు. రేవ‌య్య త‌ల్లి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో వంట మ‌నిషిగా ప‌ని చేస్తున్నారు.

also read : IAS Toppers : సివిల్స్ టాపర్ ఇషితా కిశోర్.. 933 మంది ఎంపిక

శివ మారుతికి రెండో  ప్రయత్నంలో 132వ  ర్యాంకు 

జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మండ‌లం ఐలాపూర్ కు చెందిన  ఏనుగు శివమారుతి రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 132వ  ర్యాంకు సాధించారు. శివ మారుతి రెండో  ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించారు.  ఆయన ఐపీఎస్ కు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ డిగ్రీ కళాశాలలో బీఏ ఎకనమిక్స్ చేశాక.. శివమారుతి రెడ్డి సివిల్స్ లో కోచింగ్ తీసుకున్నారు. శివ తండ్రి అంజిరెడ్డి మల్లాపూర్ మండలం గుండంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.

Exit mobile version