Telangana woman: నాడు నేడు.. అదే కథ.. అదే వ్యథ!

2020లో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతున్న సమయంలో.. ప్రభుత్వాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్న వేళ.. తన కొడుకును ఇంటికి తీసుకురావడానికి ఓ తల్లి స్కూటీపై 1,400 కిలోమీటర్లు ప్రయాణించింది.

Published By: HashtagU Telugu Desk
Ukrain

Ukrain

2020లో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతున్న సమయంలో.. ప్రభుత్వాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్న వేళ.. తన కొడుకును ఇంటికి తీసుకురావడానికి ఓ తల్లి స్కూటీపై 1,400 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇప్పుడు యుద్దంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 19 ఏళ్ల తన కుమారుడి కోసం ఆందోళన చెందుతోంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు రజియా బేగం తూర్పు యూరోపియన్ దేశంలో సుమీలో MBBS మొదటి సంవత్సరం చదువుతున్న తన కుమారుడు నిజాముద్దీన్ అమన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. సుమీ రష్యా సరిహద్దుకు సమీపంలో ఉంది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తన వార్డుతోపాటు ఇతర భారతీయ విద్యార్థులు క్షేమంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీలను కోరారు. నిజాముద్దీన్ అమన్ బంకర్లలో ఉంటూ తనతో ఫోన్‌లో సంభాషిస్తున్నాడని తల్లి తల్లడిల్లుతోంది. రెండేళ్ల క్రితం నెల్లూరులో ఉన్న కొడుకు కోసం లాక్ డౌన్ సమయంలో పోలీసుల అనుమతి తీసుకొని 1400 కిలోమీటర్లు ప్రయాణించి క్షేమంగా తీసుకొచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ బారి నుంచి తన కొడుకును రక్షించాలని వేడుకుంటోంది.

  Last Updated: 04 Mar 2022, 11:33 AM IST