Rain Alert Telangana : నేడు, రేపు వానలు.. ముందస్తుగా మాన్ సూన్స్

హాట్ హాట్ ఎండలతో చెమటలు కక్కుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. ఇవాళ, రేపు (శుక్ర, శని) రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడనుంది. పలుచోట్ల మోస్తరు వర్షాలు (Rain Alert Telangana) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Rain Alert Telangana

Rain Alert Telangana

హాట్ హాట్ ఎండలతో చెమటలు కక్కుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. ఇవాళ, రేపు (శుక్ర, శని) రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడనుంది. పలుచోట్ల మోస్తరు వర్షాలు (Rain Alert Telangana) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు(Rain Alert Telangana)  కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు గురువారం నల్గొండలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిగతా జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

also read : Weather Update Today: మోకా తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఈ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం..!

తెలంగాణలో వేడిగాలుల తీవ్రత పెరుగుతుండటంతో రుతుపవనాలు సకాలంలో వస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. జూన్ 4 నుంచి చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే నాలుగు రోజుల ముందుగానే వస్తాయని అంచనా. జూన్ 7 మరియు 15 మధ్య దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో రుతుపవనాల వర్షాలు ప్రారంభమవుతాయని స్కైమెట్ నిపుణులు చెబుతున్నారు. మేఘాల కదలికలు, వాతావరణ నమూనాలను పరిగణనలోకి తీసుకుని.. జూన్ 1 నుంచి కేరళలో చురుకైన రుతుపవనాలు ప్రారంభమవుతాయని అంటున్నారు.

  Last Updated: 19 May 2023, 11:48 AM IST