CM Revanth Reddy : తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రూ.1,500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధి మార్గంలో నడిపించడమే మా లక్ష్యం. యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మలిచాం. భక్తులకు సౌకర్యంగా ఉండేలా కొండపై ఆటోలు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నాం. 60 కిలోల బంగారంతో ఆలయ గోపురాన్ని నిర్మించాలని నిర్ణయించాం. టీటీడీ మాదిరిగా తెలంగాణలో వైటీడీ (YTD) ఏర్పాటుచేశాం. యాదగిరిగుట్టలోని విద్యాసంస్థలను విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్తాం అని వెల్లడించారు.
Read Also: DSC : ఇక పై ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి లోకేశ్
మూసీ నదిపై మాట్లాడుతూ..ఎవరు అడ్డుగా నిలబడ్డా సరే మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ రైతులకు న్యాయం చేస్తాం. గోదావరి జలాలతో మూసీ నదిని నింపేందుకు చర్యలు తీసుకుంటాం. సబర్మతి, గంగా నదులు శుభ్రం చేయగలిగితే, మన మూసీ ఎందుకు కాదు? అని ప్రశ్నించారు. గత పాలనపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం, బంగారు తెలంగాణ పేరుతో గత పదేళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు. వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామంటూ ఇళ్లు కూలగొట్టారు. తర్వాత మాత్రం పట్టించుకోలేదు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీశారు. విద్యార్థులు, రైతులు, ఉద్యమకారుల జీవనాన్ని ప్రమాదంలోకి నెట్టారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే రూ.20 లక్షల కోట్లలో రూ.2 వేల కోట్లు వెచ్చించలేదు, అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాదగిరిగుట్ట వద్ద జరిగిన అపచారానికి ప్రజలు మూల్యం చెల్లించారు. పాపాలు చేసినదే వారి పరిస్థితిని ఆ దిశగా తీసుకెళ్లింది. తమ పార్టీలో దెయ్యాలున్నాయని ఆ పార్టీ నాయకురాలే అన్న విషయం గుర్తుంచుకోవాలి. జవాబులు చెప్పలేక దెయ్యాల నేత ఫాంహౌస్‌లో నిద్రపోతున్నాడు. బీఆర్‌ఎస్ కాదు.. అది డీఆర్‌ఎస్ దెయ్యాల రాజ్యసమితి. ఈ దెయ్యాలను తరిమికొట్టే బాధ్యత నాది. అందుకు కార్యకర్తల సహకారం అవసరం అని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్టుగా స్పష్టం చేశారు.
Read Also: Mahesh Goud : ఈనెలలోనే మంత్రివర్గ విస్తరణ.. టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన