Site icon HashtagU Telugu

Congress : మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు

Telangana leaders for Maharashtra and Jharkhand election campaign

Telangana leaders for Maharashtra and Jharkhand election campaign

Assembly Elections : మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ఉన్నారు. జార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు తారిక్‌ అన్వర్‌, అధిర్‌ రంజన్‌ చౌదరిని నియమించారు. రాష్ట్ర ఎన్నికల సీనియర్ కోఆర్డినేటర్లుగా పార్టీ నేతలు ముకుల్ వాస్నిక్, అవినాష్ పాండేలను నియమించారు.

హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భావించినా కాంగ్రెస్.. ఫలితాలు వెలువడే సరికి ఆశలన్నీ తలకిందులయ్యాయి. అధికారం పోయి ప్రతిపక్షంలో కూర్చోవల్సి వచ్చింది. తిరిగి బీజేపీనే అధికారంలోకి వచ్చింది. అనంతరం జమ్మిక్కులు చేసి బీజేపీ గెలిచిందంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇక హర్యానా ఫలితాలతో పాఠం నేర్చుకున్న హస్తం పార్టీ.. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించి అప్రమత్తం అయింది.

Read Also: Sai Durgha Tej : బ్లడ్ బ్యాంక్‌లో సాయి దుర్గ తేజ్ బర్త్ డే వేడుకలు..