Singareni : సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Singareni : శుక్రవారం ప్రతి కార్మికుని ఖాతాలో రూ. 93,750 జమ కానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో.. సంస్థలోని 42 వేల మంది కార్మికులు దీపావళి బోనస్ అందుకోనున్నారు. అంతకుముందు లాభాల వాట రూ. 796 కోట్లను కార్మికుడికి సగటున రూ. 1.90 లక్షలు అందజేసిన సగంతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
telangana government announced Diwali bonus for Singareni workers

telangana government announced Diwali bonus for Singareni workers

Diwali Bonus : తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దీపావళి కానుక ప్రకటించింది. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. బోనస్ కింద రూ. 358 కోట్లు విడుదల చేసింది సర్కార్. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం ప్రతి కార్మికుని ఖాతాలో రూ. 93,750 జమ కానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో.. సంస్థలోని 42 వేల మంది కార్మికులు దీపావళి బోనస్ అందుకోనున్నారు. అంతకుముందు లాభాల వాట రూ. 796 కోట్లను కార్మికుడికి సగటున రూ. 1.90 లక్షలు అందజేసిన సగంతి తెలిసిందే.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హమీలను నెరవేర్చే దిశలో ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలోని సింగరేణి గనుల డెవలప్ మెంట్ కోసం సీఎం రేవంత్ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని గనుల ద్వారా మనకు విద్యుత్ తో పాటు, బొగ్గును విక్రయించడం ద్వారా ఆదాయం కూడా లభిస్తుంది. సింగరేణి కాలరీస్ లో చాలా మంది కార్మికులు తమ ప్రాణాలను సైతం ఎదురొడ్డి మరీ గనుల్లో పనిచేస్తుంటారు. అలాంటి కార్మికులకు రేవంత్ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది.

Read Also: New Judges : ఏపీ హైకోర్టుకు ముగ్గురు నూతన జడ్జిల నియామకం..

 

 

  Last Updated: 24 Oct 2024, 04:53 PM IST