Site icon HashtagU Telugu

KCR : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..కేసీఆర్‌కు ఆహ్వానం: రేవంత్‌ రెడ్డి

Telangana Formation Day celebrations..Invitation to KCR: Revanth Reddy

Telangana Formation Day celebrations..Invitation to KCR: Revanth Reddy

Telangana Formation Day:బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR)ను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ చార్జీ వేణుగోపాల్ రావు(Venugopal Rao)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ  వేణుగోపాల్  కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరాడు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని వేణుగోపాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం నిన్నటి నుంచి వేచి చూస్తున్నారు వేణుగోపాల్. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో కలిసే ప్రయత్నాలు చేశారు. ఫామ్ హౌజ్ కు వద్దు.. హైదరాబాద్ లో కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇప్పిస్తామని కేసీఆర్ ఆఫీస్ వర్గాలు తెలిపాయి.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు రేపు సీఎం రేవంత్‌ రెడ్డి గవర్నర్‌(Governor)ను కలిసి ఆహ్వాన పత్రికను అందించనున్నారు. ఈ ఏడాది దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్ర గేయం జయజయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరోసారి దీనిని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితో పాడించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ కి ఆహ్వానం అందించి సన్మానించనున్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Read Also: T20 World Cup History: 2007 నుంచి 2022 వరకు టీ20 ప్రపంచకప్ చరిత్ర