See Pic: ప్రతి గింజలో నువ్వే ఉంటవ్..!

రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రైతులకు వరంగా మారింది.

  • Written By:
  • Publish Date - January 11, 2022 / 03:28 PM IST

రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రైతులకు వరంగా మారింది. ఆరుగాలంలో పండించిన పంటలు సరైన సమయంలో చేతికి రాకా, అకాల వర్షాలు, ప్రతికూల అంశాలతో రైతన్నలు ఇబ్బందుల పాలవుతుంటే.. పెట్టుబడిసాయం పెద్దదిక్కుగా నిలుస్తోంది. ఈ ఏడాది పెట్టుబడి సాయంగా 64 లక్షల మంది అన్నదాతలకు 50వేల కోట్ల పెట్టుబడి అందించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రైతులు సంక్రాంతికి ముందే సంబురాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలోని అన్నిజిల్లాల్లో రైతుబంధు సంబురాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పథకం ప్రవేశెట్టిన ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెబుతూ రైతులు ఆనందపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా నారాయణపురంలో కొంతమంది రైతులు మొక్కలు, వరితో కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

రైతబంధు ట్రెండింగ్!

రైతుబంధు కేసీఆర్” #RythubandhuKCR అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాళ సోషల్ మీడియాలో హోరెత్తింది. ట్విట్టర్ లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది!తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సాయం పంపిణీ ఈ రోజు రు.50 వేల కోట్లకు చేరుకుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబరాలు మిన్నంటాయి. ఇంత భారీ మొత్తంలో రైతులకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చిన చరిత్ర, ఘనత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.