Site icon HashtagU Telugu

Teens and Pornography: పోర్న్ వలలో ‘టీనేజర్స్’.. సర్వేలో షాకింగ్ విషయాలు!

teens and Porn

Porn

టీనేజర్స్.. (Teens) ఉరకలు వేస్తే ఉత్సాహం వాళ్లది. అటు పుస్తకాలు, ఇటు దోస్తులతో అందమైన జీవితం గడిపే వయసు వాళ్లది. అలాంటి టీనేజర్స్ (Teens) సెల్ వలలో చిక్కుకుంటున్నారు. తమ చదువులను పక్కన పెట్టి మొబైల్ తో కాలక్షేపం చేస్తున్నారు. చిన్న వయసులోనే మెంటల్ హెల్త్ కు గురవుతున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తమ మొబైల్స్ లో నిత్యం బూతు వీడియోలు చేస్తూ పోర్నోగ్రఫీ  (Porn) బారిన పడుతున్నారని లేటెస్ట్ సర్వేలో తేలింది.

కామన్ సెన్స్ మీడియా అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో (Survey) పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 50 శాతం మంది టీనేజర్లు 13 ఏళ్లలోపు పోర్న్‌ బారిన పడుతున్నట్టు స్పష్టమైంది. ఇటీవల “టీన్స్ అండ్ పోర్నోగ్రఫీ” (porn and teens) పేరుతో విడుదల చేసిన నివేదికలో 1,350 మంది టీనేజర్లు (Teens) ఉన్నారు. ఈ సర్వేలో 13 నుండి 17 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. సగానికి పైగా టీనేజర్స్ తమకు తెలియకుండా పోర్న్‌ కు అడిక్ట్ అవుతున్నారు. 58% మంది అనుకోకుండా పోర్న్‌లో పొరపాట్లు చేశారు. వాస్తవానికి ఇంటర్నెట్‌లో అలాంటి విషయాలను చూడటానికి ప్రయత్నించడం లేదు. కానీ వీరిలో 63% మంది క్రమ క్రమంగా పోర్న్ వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది.

కానీ 44% మంది ఆన్‌లైన్ అశ్లీల వీడియోలను (porn videos) ఉద్దేశపూర్వకంగా చూసినట్టు ఒప్పుకున్నారు. చాలామంది యువకులు ఆన్‌లైన్‌లో మల్టీప్లేయర్ గేమ్‌లు ఆడుతున్నప్పుడు, స్నేహితుల ద్వారా అశ్లీలతకు అలవాటు పడ్డట్టు నివేదిక పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా పోర్న్ చూసిన వారిలో 38% మంది ఉన్నారు. 44% మంది అసలైన వెబ్‌సైట్‌లలో యాక్టివ్ గా ఉంటుండగా, 34% మంది YouTube వంటి స్ట్రీమింగ్, 18% మంది పోర్న్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని సర్వే రిపోర్ట్ చేసింది. టీనేజ్ పిల్లలు పోర్న్ బారిన పడుతుండటంతో ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. IT రూల్స్ 2021 ప్రకారం.. భారత ప్రభుత్వం అనేక అశ్లీల సైట్‌లను నిషేధించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత 2018లో 800 పైగా అశ్లీల వెబ్‌సైట్‌లను నిషేధించారు.

Also Read: Phone Shocked: ఫోన్‌ మాట్లాడుతుండగా యువతికి షాక్‌.. మరో ఇద్దరికి కూడా!

Exit mobile version