Site icon HashtagU Telugu

Bacteria Bomb On Malaria : ఆ బ్యాక్టీరియాతో మలేరియాకు చెక్.. మహమ్మారిపై పరిశోధనల్లో కీలక పురోగతి

World Malaria Day

Bacteria Bomb On Malaria

Bacteria Bomb On Malaria : మలేరియాపై మానవాళి జరుపుతున్న పోరాటంలో కీలక ముందడుగు పడింది.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మందిని బలితీసుకుంటున్న ఆ మహమ్మారి  వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ఒక మార్గం దొరికింది.

దోమల నుంచి మనుషులకు మలేరియా వ్యాప్తిని నిరోధించే ఉపాయం లభ్యమైంది.

Also read : Prices Increased: ఇకపై ఈ కార్లు చాలా కాస్ట్లీ.. ధరలను పెంచిన కంపెనీ..!

అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంతో కలిసి స్పెయిన్‌లోని GSK ఫార్మాస్యూటికల్ కంపెనీ లేటెస్ట్ గా నిర్వహించిన ప్రయోగాల్లో ఓ ఉపయోగకర అంశం వెలుగులోకి వచ్చింది. మన పర్యావరణంలో సహజంగా ఉండే “TC1” అనే బ్యాక్టీరియాతో దోమలపై జరిపిన ప్రయోగాల్లో సత్ఫలితాలు వచ్చాయి. “TC1” అనే బ్యాక్టీరియాను దోమల జీర్ణాశయంలోకి ప్రవేశపెట్టగా.. అది అందులోని ఇతర గట్  బ్యాక్టీరియాలతో కలిసిపోయి “హర్మేన్” (harmane) అనే ఒక చిన్నమాలిక్యూల్ (అణువు) ను స్రవిస్తోంది. ఇది రిలీజ్ అయిన తర్వాత.. దోమల శరీరంలో ఉండే  మలేరియా కారక పరాన్నజీవుల (పారసైట్ల)  అభివృద్ధి వేగం తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా దోమలలో ఉండే మలేరియా పారసైట్ల లోడ్ 73 శాతం వరకు తగ్గిపోతోందని వెల్లడైంది. ఆఫ్రికా దేశం  బుర్కినా ఫాసోలోని “మస్కిటోస్పియర్” అని పిలువబడే ఫీల్డ్ రీసెర్చ్ ఫెసిలిటీలో జరిపిన ట్రయల్స్ లో ఈ ఫలితాలు వచ్చాయి.  “TC1” బ్యాక్టీరియాకు చెందిన harmane  మాలిక్యూల్ ను చక్కెరతో కలిపి దోమలకు అందించవచ్చని(Bacteria Bomb On Malaria) పరిశోధకులు చెప్పారు. harmane  మాలిక్యూల్ ను ద్రావణంలో కలిపి దోమలపై స్ప్రే చేసినా.. అది దోమల శరీరంలోకి వెళ్లి  మలేరియా పారసైట్ల లోడ్ ను తగ్గిస్తుందని తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Also read : Today Horoscope : ఆగస్టు 4 శుక్రవారం రాశి ఫలితాలు ఇవీ..