Tata Helicopters : టాటా హెలికాప్టర్లు వస్తున్నాయ్..

Tata Helicopters :  ఇప్పటిదాకా మనం టాటా కార్లు, లారీలు, ట్రక్కులు, మినీ ఆటోలను వాడుతున్నాం..

Published By: HashtagU Telugu Desk
Tata Helicopters

Tata Helicopters

Tata Helicopters :  ఇప్పటిదాకా మనం టాటా కార్లు, లారీలు, ట్రక్కులు, మినీ ఆటోలను వాడుతున్నాం.. ఉప్పు నుంచి ఉక్కు దాకా ప్రతీదీ టాటా గ్రూప్ తయారు చేస్తుంటుంది. త్వరలో మేడిన్ ఇండియా హెలికాప్టర్లను కూడా టాటా గ్రూప్ మన ముందుకు తీసుకు రాబోతోంది. రానున్న రోజుల్లో మనదేశంలో సివిల్ హెలికాప్టర్లను టాటా గ్రూప్ తయారు చేయనుంది. దీనికి సంబంధించి టాటా గ్రూప్,  ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ  ఎయిర్ బస్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రెండు సంస్థలు కలిసి ఎయిర్ బస్ సివిల్ హెలికాప్టర్లను తయారు చేయనున్నాయి. భారత్ లోనే స్థానికీకరణను ప్రోత్సహించే చర్యల్లో భాగంగానే ఈ ఒప్పందంపై సంతకం చేశామని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయేల్ మక్రాన్ భారత పర్యటనలో భాగంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరగాయని వినయ్ క్వాత్రా చెప్పారు. ఇప్పటికే భారత్ ఫ్రాన్స్ నుంచి రాఫేల్ యుద్ధ విమానాల వంటి బిగ్ డీల్స్ చేసుకుంది. ముఖ్యంగా వైమానిక, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడనున్నాయి. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మక్రాన్ గురువారం భారత్‌కు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జైపూర్ నగరంలో ఆయనను ఆప్యాయంగా ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడేందుకు ఈ పర్యటన దోహదం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

మన దేశంలోనే హెచ్125 సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ల(Tata Helicopters) తయారీ కోసం ఎయిర్ బస్, టాటా గ్రూపులు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీనికి అవసరమైన రక్షణ-పారిశ్రామిక రోడ్‌మ్యాప్‌‌కు భారత్, ఫ్రాన్స్ దేశాలు పరస్పరం  అంగీకరించాయి. ఈ హెలికాప్టర్లను వాణిజ్య అవసరాల కోసం తయారు చేయనున్నారు. టాటా గ్రూప్ అనుబంధ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్) ఈ హెలికాప్టర్ల అసెంబ్లింగ్ లైన్‌ను నిర్వహిస్తుంది. వీటిని మెడికల్ ఎయిర్‌లిఫ్ట్, నిఘా మిషన్లు, వీఐపీ, సందర్శనా అవసరాల కోసం వినియోగించనున్నారు. ఇప్పటికే టాటా, ఎయిర్‌బస్ సంస్థలు కలిసి 40 సీ295 రవాణా విమానాలను తయారు చేస్తున్నాయి.

Also Read :Celebrities Divorces : సెలబ్రిటీల విడాకులకు కారణాలు ఇవేనా ?

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నిర్మాణ పరిశ్రమకు అనుకూలీకరించిన అదనపు బల ఉత్పత్తులు, పరిష్కారాలను అందించడానికి టాటా స్టీల్ తమ మూడవ పూర్తి ఆటోమేటెడ్ నిర్మాణ సేవా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ అనుపమ్, ఇతర సీనియర్ కంపెనీ అధికారులతో పాటు ఛానెల్ పార్టనర్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు.

  Last Updated: 26 Jan 2024, 06:11 PM IST