అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాక్ లో అగ్గి రాచుకుంది. ఆ దేశంలోని అన్ని నగరాల్లో పెద్దఎత్తున నిరసనలు (imran arrest public protest) జరుగుతున్నాయి. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కార్యకర్తలు ఆందోళనల(imran arrest public protest)తో హోరెత్తిస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకుందనే వార్తలు రావడంతో.. ఏకంగా మిలిటరీ స్థావరాల దగ్గర పీటీఐ క్యాడర్ నిరసనలకు దిగుతోంది. రావల్పిండి లోని నేషనల్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ “రేడియో పాకిస్తాన్” భవనానికి ఆందోళనకారులు మంగళవారం నిప్పు పెట్టారు. కొందరు నిరసనకారులు(imran arrest public protest) రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి ప్రధాన గేటును ధ్వంసం చేశారు. దీంతో గుంపును చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ నివాసానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇందులోని గేటు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. లాహోర్, కరాచీ, పెషావర్ , ఇతర నగరాల్లో ఖాన్ పీటీఐ మద్దతుదారుల నిరసనలపై భద్రతా దళాలు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించాయి. ఈక్రమంలో అనేక మంది నిరసనకారులు మరణించారని, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని పీటీఐ పార్టీ పేర్కొంది.
దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, గుజ్రాన్‌వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, మర్దాన్, సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్, బలూచిస్తాన్‌లోని క్వెట్టా వీధుల్లోనూ మంగళవారం నిరసనలు జరిగాయి. నిరసనకారులు ఇళ్ళు, కార్యాలయాలు, వాహనాలపై రాళ్లు రువ్వారు. బ్యానర్లు, టైర్లు తగులబెట్టడంతో పాటు రోడ్లను దిగ్బంధించారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాల ఎదుట నిరసనకు దిగారు.
ALSO READ : Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
పాక్ హోమ్ మంత్రి ఇంటిపై రాళ్లదాడి
ఫైసలాబాద్ నగరంలోని పాక్ హోమ్ మంత్రి రాణా సనావుల్లా ఇంటిపై పీటీఐ కార్యకర్తలు రాళ్లు రువ్వారు.అక్రమంగా చొరబడి ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను పాడు చేసే “ఉక్కు చేతి”తో అణచివేస్తామంటూ సనావుల్లా ట్విట్టర్ వేదికగా ఆందోళనకారులకు వార్నింగ్ ఇచ్చారు. “దుర్మార్గులు, గూండాలను చట్టప్రకారం ఎదుర్కోవాలి” అని భద్రతా బలగాలను ఆయన ఆదేశించారు. శాంతియుతంగా నిరసన తెలపాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పీటీఐ పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.
అయినా ఆందోళనకారులను నియంత్రించడం పోలీసులకు కష్టతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పాకిస్తాన్ ప్రభుత్వం ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా సైట్‌లను బ్లాక్ చేసింది. ఇంటర్నెట్ సేవలను పరిమితం చేసింది.
దీనిపై స్పందించిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ.. ” ఇంటర్నెట్ , సోషల్ మీడియాను ఆపడం అనేది సమాచార యాక్సెస్ నుం భావప్రకటనా స్వేచ్ఛను పరిమితం చేస్తుంది” అని ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఈ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ, హోమ్ శాఖను కోరింది. మరోవైపు లండన్ లోనూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ సపోర్టర్స్ నిరసనలు తెలిపారు. ఈ ఏడాది చివర్లో పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ : Al Qadir Trust scam : ఇమ్రాన్, బుష్రా.. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ?
మార్చిలోనే అరెస్ట్ కు ప్రిపేరైన ఇమ్రాన్ ?
ఇమ్రాన్ ఖాన్ తన అరెస్టును ముందుగానే ఊహించారు. అందుకోసం పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీని నిర్మాణాత్మకంగా సిద్ధం చేశారు. మార్చిలో ఆయన పార్టీలో
ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఆరుగురు సభ్యులను నియమించారు. తాను లేనప్పుడు పార్టీ వ్యవహారాలను నిర్వహించే బాధ్యతను దానికి అప్పగించారు. దీనికి పీటీఐ సీనియర్ వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీ నేతృత్వం వహిస్తున్నారు. ఖురేషి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ” ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చట్టవిరుద్ధం. కోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రజలు వీధుల్లోకి రావాలి ” అని ఆయన పిలుపును ఇచ్చిన తర్వాతే పాక్ లో నిరసనలు మొదలయ్యాయి. శాంతియుతంగా నిరసనలు తెలపాలని ఆ పార్టీలోని ఇతర నేతలు ఆ తర్వాత వరుస ప్రకటనలు చేశారు .
ప్రముఖ కిక్ బాక్సర్ వివాదాస్పద రియాక్షన్ ..
ఇమ్రాన్ అరెస్ట్ పై బ్రిటన్ కు చెందిన ప్రముఖ కిక్ బాక్సర్ ఆండ్రూ టేట్ స్పందిస్తూ ఒక ట్వీట్ చేశాడు. “మంచివాళ్లందరూ జైలుకు వెళతారు” అని ఆ పోస్ట్ లో రాశాడు. ఖాన్ అన్యాయానికి గురయ్యాడని, గొప్ప ఆశయాలు ఉన్నందుకే ఈ ఇబ్బందులు అని పరోక్షంగా చెప్పాడు. ఈ ట్వీట్ కుగానూ అతడు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. పాక్ రాజకీయ పరిస్థితిని, వాస్తవాలను తెలుసుకోకుండా ఖాన్ “మంచి వ్యక్తి” అని చెప్పడం సరికాదని కొందరు నెటిజన్స్ ఆండ్రూ టేట్ కు సూచించారు . వ్యక్తిగత ప్రచారం కోసమే ఖాన్ అరెస్టును ఆండ్రూ టేట్ వాడుకుంటున్నాడని ఇంకొందరు విమర్శించారు. చట్ట పాలన, ప్రజాస్వామ్య ప్రక్రియ పై ఆండ్రూ టేట్ కు గౌరవం లేదనడానికి ఈ ట్వీట్ నిదర్శనం అని పలువురు కామెంట్స్ చేశారు.