Site icon HashtagU Telugu

Tanzanian internet sensation: సోషల్ మీడియా స్టార్ పై దాడి…ప్రాణాలతో బయటపడ్డ కిలీపాల్..!!

killi paul

killi paul

సోషల్ మీడియా, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత…చాలా మంది తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు. దేశ విదేశాలకు చెందిన వ్యక్తులు కూడా భాషాభేదం లేకుండా తమ ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా స్టార్స్ గా ఎదుగుతున్నారు. అలాంటి సోషల్ మీడియా స్టార్స్ లో ఒకరైన టాంజానియానికి చెందిన కిలీ పాల్. కిలీపాల్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కత్తితో దాడి చేసి…కర్రలతో కొట్టారు. అయితే కిలీపాల్ దుండగుల దాడి నుంచి తప్పించుకున్నాడు. తనపై దాడి చేసినవారిపై తిరగబడి..అక్కడి నుంచి ప్రాణాలతో భయపడ్డాడు.

ఈఘటన గురించి కిలీపాల్ తన ఇన్ స్టాలో గాయాలతో ఉన్న ఓ ఫోటోను షేర్ చేశాడు. అంతేకాదు తనపై ఐదుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేసినట్లు చెప్పాడు. కుడి చేతి బొటనవేలుకు కత్తి గాయాలు అయ్యాయని…ఐదు కుట్లు వేశారని తెలిపాడు. తనను కొట్టినవారు పారిపోయారని…అప్పటికే తాను గాయపడినట్లు…త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించమని కిలీ పోస్టు చేశాడు.

ఇక సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిలీ..టాంజానీయాలోని భారత హైకమిషనర్ బినయ ప్రదా సత్కరించారు. కిలీపాల్ కు ఇన్ స్టాలో 3.6మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతని సోదరి కూడా సోషల్ మీడియాలో సంచలనం. బాలీవుడ్, సౌతిండియా సినిమా పాటలకు కిలీ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

Exit mobile version