Site icon HashtagU Telugu

Taliban Commander : మిలిటరీ ఛాపర్‌లో నవ వధువును ఇంటికి తీసుకెళ్లిన తాలిబ‌న్ క‌మాండ‌ర్‌

Taliban

Taliban

తాలిబన్ కమాండర్ తన నవ వధువును ఇంటికి తీసుకెళ్లేందుకు మిలటరీ హెలికాప్టర్‌ను ఉపయోగించాడు. మీడియా నివేదికల ప్రకారం అతను ఛాపర్‌ని ఉపయోగించి తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని లోగర్ నుండి ఖోస్ట్ ప్రావిన్స్‌కు తన భార్య‌ను వెళ్లాడు. తాలిబాన్ హ‌క్కానీ శాఖ కమాండర్‌గా పేర్కొన్నారని ఆఫ్ఘనిస్తాన్ స్థానిక మీడియా తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో కమాండర్ వధువు ఇంటి దగ్గర దిగడం కనిపించింది.

కమాండర్ త‌న పెళ్లి సంద‌ర్భంగా తన మామగారికి 1,200,000 ఆఫ్ఘనిస్‌లను కట్నంగా ఇచ్చాడు. క‌మాండ‌ర్‌ ఖోస్ట్‌లో నివసిస్తుండ‌గా.. అతని భార్య ఇల్లు లోగర్‌లోని బార్కి బరాక్ జిల్లాలో ఉంది. లోగర్ ప్రావిన్స్‌లోని బార్కీ బరాక్ జిల్లాలోని షా మజార్ ప్రాంతంలో శనివారం ఈ సంఘటన జరిగింది. అయితే, కమాండర్‌ను సమర్థిస్తూ తాలిబాన్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఖారీ యూసుఫ్ అహ్మదీ మాట్లాడారు. క‌మాండ‌ర్‌పై వ‌చ్చిన ఆరోపణలు తప్పు అని వాదించారు. తాలిబానీ కమాండర్ సైనిక హెలికాప్టర్‌ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ తోసిపుచ్చింది. వైరల్ అవుతున్న వీడియోపై సోషల్ మీడియాలో ప్రజలు తమ నిరసనను నమోదు చేశారు. ఈ చర్యను వారు ఖండిస్తూ, ఇది ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేయడమేనని అన్నారు.

Cover Pic: File Pic for representation purpose only

Exit mobile version