కాలేజీకి వెళ్లే పిల్లలు పుస్తకాలు పక్కన పెట్టి పీకల్లోతు ప్రేమలో మునిగితే అటు తల్లిదండ్రులు, అటు కాలేజీ యాజమాన్యాలు క్లాస్ పీకడం, వెంటనే వార్నింగ్ ఇవ్వడం చాలా కామన్. కానీ అదే చైనా (China)లో అయితే ‘‘ప్రేమలో ఉన్నారా.. హాయిగా ప్రేమించుకోండి, వీలైతే సెలవులు కూడా తీసుకోండి (Love Holidays)’’ అంటూ ఆఫర్ ప్రకటిస్తోంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టానుసారంగా ప్రేమించుకునేలా ఎంకరేజ్ చేస్తోంది.
అంతేకాదు.. అందుకోసం ఏడాదిలో 7 రోజుల సెలవులను కూడా ఇస్తున్నాయి. బీజింగ్ లాంటి సిటీల్లో చాలా కార్పొరేట్ సంస్థలు కూడా జంటలకు ప్రత్యేకంగా సెలవులను ఇస్తున్నాయట. చైనా ప్రభుత్వం (Love Holidays) ఇలా వ్యవరించడం పలు దేశాలను షాక్ గురిచేస్తోంది. అయితే ప్రేమికులకు ఆఫర్ ప్రకటించడం వెనుక పెద్ద కారణమే ఉందట. కరోనా కారణంగా చైనా అతలాకుతలమైన విషయం తెలిసిందే. కొవిడ్ ఎంట్రీతో ఆ దేశ ఆర్థిక పరిస్థితులు, వీదేశి సంబంధాలతో పాటు అక్కడ సంతనోత్పత్తి, పెళ్లిల రేటు ఘోరంగా తగ్గిపోయిందట.
ఇవన్నీ ద్రుష్టిలో ఉంచుకొని చైనా కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీలు, యూనివర్సిటీలో చదివే విద్యార్థులు ప్రేమించుకునేందుకు ప్రత్యేకంగా సెలవులను మంజూరు చేస్తోంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు పెళ్లి చేసుకోబోయే జంటకు నెలపాటు (Love Holidays) సెలవులను కూడా ఇస్తున్నాయి. ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం సంతనోత్పత్తి, పెళ్లిళ్ల సంఖ్య పెరుగుతుందని చైనా భావిస్తోంది. ఈ టాపిక్ నెట్టింట్లో వైరల్ కావడంతో ఇకేం బ్రదర్.. రెచ్చిపోండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Janhvi Kapoor: భాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుమలను దర్శించుకున్న జాన్వీ.. ఫొటో వైరల్