Tahawwur Rana : 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి,లష్కరే తోయిబా ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన తహవ్వుర్ రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి భారీ భద్రత నడుమ ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేశారు. అందులోనే రాణాను ఎన్‌ఐఏ విచారించనున్నట్లు తెలుస్తుంది. రాణా అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం నుంచి అతడిని నేరుగా జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారు. 26/11 దాడిగా ప్రసిద్ధమైన ముంబయి ఉగ్రదాడికి రాణా సూత్రధారిగా వ్యవహరించాడు. తహవ్వుర్ రాణా రాక నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భద్రత కట్టుదిట్టం చేశారు.
ఇక, తహవూర్ రాణాపై ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసును వాదించడానికి కేంద్రప్రభుత్వం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమించింది. ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టులు, అప్పిలేట్ కోర్టుల్లో ఆయన వాదనలు వినిపించనున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. దాదాపు 3 ఏళ్లపాటు లేదా కేసు విచారణ పూర్తయ్యే వరకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్ కొనసాగనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.
Read Also: CM Revanth Reddy : యంగ్ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్ : సీఎం రేవంత్ రెడ్డి