Swiggy Bouncer to Gill: స్విగ్గీపై ట్వీట్…ట్రోల్‌కు గురైన యువక్రికెటర్

స్విగ్గీ సేవలతో తనకు ఏం ఇబ్బంది కలిగిందో తెలీదు కాని ... ఆ సంస్థపై యువక్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ ఓ సెటైరికల్ ట్వీట్ చేశాడు గిల్.

Published By: HashtagU Telugu Desk
Subhaman Gill)

Shubham Gill Imresizer

స్విగ్గీ సేవలతో తనకు ఏం ఇబ్బంది కలిగిందో తెలీదు కాని … ఆ సంస్థపై యువక్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ ఓ సెటైరికల్ ట్వీట్ చేశాడు గిల్. ఎలాన్ మస్క్‌.. దయచేసి స్విగ్గీని కొనుగోలు చేయండి… అప్పుడు వారు సమయానికి ఫుడ్ డెలివరీ చేస్తారంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్విగ్గీ వెంటనే స్పందించింది. ఏదైనా ఫిర్యాదు ఉండే తనకు తెలియజేయాలని కోరింది. ఈ మధ్యే ట్విటర్‌ను కొనుగోలు చేసిన స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఇలాన్‌ మస్క్‌.. భవిష్యత్తులో తాను ఏం కొనాలనుకుంటున్నానో కూడా చెబుతున్నారు.

దీనిని ఉద్దేశించే గిల్ అలా ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు స్విగ్గీ అధికారిక ట్విట్‌ హ్యాండిల్‌ స్విగ్గీ కేర్స్‌ వెంటనే స్పందించింది. గిల్‌.. మీరు ఏదైనా ఆర్డర్‌ చేసి ఉంటే.. ఆ ఆర్డర్‌ సమయానికి అందిందని మేము భావిస్తున్నాము. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే.. మమ్మల్ని నేరుగా సంప్రదించండి.. వేగంగా పరిస్కరిస్తామని స్విగ్గీ రిప్లై ఇచ్చింది.
తర్వాత శుభ్‌మన్‌ నుంచి రిప్లై కూడా అందినట్లు మరో ట్వీట్‌లో చెప్పింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అతడు చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున నెగటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. స్విగ్గీ అనే ఓ ఫేక్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ అయితే.. శుభ్‌మన్‌కు దిమ్మదిరిగే సమాధానమిచ్చింది. టీ20 క్రికెట్‌లో నీ బ్యాటింగ్‌ కంటే కూడా మేము ఫాస్ట్‌గానే ఉన్నామంటూ ఆ అకౌంట్‌ రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు చాలా మంది నెటిజన్లు కూడా శుభ్‌మన్‌ పై ఫైరయ్యారు. ట్రాఫిక్‌లాంటి ఏవో సమస్యలుంటేనే వాళ్లు ఆర్డర్లు ఆలస్యం చేస్తారు తప్ప కావాలని కాదని ఒకరు ట్వీట్ చేశారు. ఓ వారం పాటు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తే తెలుస్తుందని మరొకరు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇంకొందరు ముందు ఆట మీద దృష్టి పెట్టాలంటూ సూచించారు. మొత్తం మీద స్విగ్గీ మీద తాను చేసిన సెటైరికల్ ట్వీట్‌ కారణంగా చివరికి గిల్ తానే ట్రోలింగ్ కు గురవ్వాల్సి వచ్చింది.

https://twitter.com/swiggysgs/status/1520099978269839360

  Last Updated: 30 Apr 2022, 10:14 PM IST