Site icon HashtagU Telugu

Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

Swiggy

Swiggy

కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి స్విగ్గీ బాయ్ ఫుడ్ డెలివరీ బ్యాగ్‌ని పట్టుకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాడు. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో తెల్లటి గుర్రపు స్వారీ చేస్తూ కనిపించాడు. గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేయడంతో ఎంతోమంది ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరా కుర్రాడు? ఎక్కడ ఉంటాడు? నెటిజన్స్ తో పాటు స్విగ్గీ సైతం అడ్రస్ కోసం వెతుకులాడుతోంది. జోరువానలో స్విగ్గీ ఫుడ్ బ్యాగ్ ను తగిలించకొని.. ట్రాఫిక్ ను దాటుకుంటూ ఫుడ్ డెలివరీ చేయడంతో ఆ కుర్రాడి వైరల్ గా మారింది.  ‘‘Swiggy Moneyలో 5K ఉంది. ఆ కుర్రాడి అడ్రస్ చెబితే రూ.5 వేల డబ్బును అందిస్తాం. మేం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము” అని స్విగ్గీ ట్యాగ్ చేసింది.

https://youtu.be/H54-MYgEiTc

Exit mobile version