Swiggy and Zomato: జోమాటో బాయ్ కు స్విగ్గీ బాయ్ సాయం.. వైరల్ వీడియో!

కాలం మారుతున్న కొద్ది ప్రజల జీవన శైలి కూడా మారుతుంది. ప్రస్తుత కాలంలో అయితే వంట చేయడానికి సమయం

Published By: HashtagU Telugu Desk
Swiggy Zomato Friendship

Swiggy Zomato Friendship

కాలం మారుతున్న కొద్ది ప్రజల జీవన శైలి కూడా మారుతుంది. ప్రస్తుత కాలంలో అయితే వంట చేయడానికి సమయం పడుతుంది, వంట చేయడానికి ఓపిక లేదు అనుకోగానే వెంటనే స్విగ్గి, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్ లలో ఫుడ్ ని ఆర్డర్ చేసి వెంటనే క్షణాలు తెప్పించుకుని తింటున్నారు. అయితే కొంతమంది డెలివరీ బాయ్ ఫుడ్ లేటుగా తేవడం వల్ల వారిని తిడుతూ కొన్ని కొన్ని సార్లు వారిపై చేయి కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఫుడ్ డెలివరీ బాయ్ లు ఫుడ్డు డెలివరీ చేయడం కోసం ఎండలను, ట్రాఫిక్ లోను దాటుకుని అనుకున్న సమయానికి ఫుడ్ నుండి డెలివరీ చేస్తూ ఉంటారు.

కానీ వారి పరిస్థితులను అర్థం చేసుకోకుండా కొంతమంది వారిపై సీరియస్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఆర్డర్లను క్యాన్సిల్ చేస్తూ ఆ డెలివరీ బాయ్ లకు లేనిపోని కష్టాలు తెస్తూ ఉంటారు. ఇది తాజాగా ఒక డెలివరీ బాయ్ కి మరొక డెలివరీ బాయ్ సహాయం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ వీడియోలో జొమాటో డెలివరీ బాయ్ సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేయడానికి వెళుతూ ఉండగా.. ఇంతలో అటుగా స్విగ్గి డెలివరీ బాయ్ బైక్ పై వెళుతూ జొమాటో డెలివరీ బాయ్ సైకిల్ ని పట్టుకుని ముందుకు వెళ్తున్నాడు.

 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే సదరు స్విగ్గి డెలివరీ బాయ్ తనతోపాటు జొమాటో డెలివరీ బాయ్ కూడా ఫుడ్ ని తొందరగా డెలివరీ చేయాలి అని అతనికి సహాయం చేయడం అన్నది నెటిజన్స్ బాగా నచ్చింది. అయితే ఈ దృశ్యాన్ని కారులో వెళ్తున్న ఒక వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  Last Updated: 19 Jul 2022, 01:14 PM IST