Spy Pigeon : పావురం అరెస్ట్.. 8 నెలల తర్వాత విడుదల.. ఎందుకు ?

Spy Pigeon : చైనా కోసం గూఢచర్యం చేసేందుకు  ఇండియాకు వచ్చిందనే అభియోగాలతో  అరెస్టయిన పావురం ఎట్టకేలకు రిలీజ్ అయింది.

  • Written By:
  • Updated On - February 1, 2024 / 12:47 AM IST

Spy Pigeon : చైనా కోసం గూఢచర్యం చేసేందుకు  ఇండియాకు వచ్చిందనే అభియోగాలతో  అరెస్టయిన పావురం ఎట్టకేలకు రిలీజ్ అయింది. దాదాపు 8 నెలల తర్వాత ఈ పావురం బోను నుంచి స్వేచ్ఛను పొందింది. ఈ వివరాలను ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఉన్న  బాయ్ సాకార్ బాయ్ దిన్షా పెటిట్ హాస్పిటల్ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..  గతేడాది మేలో ముంబైలోని చెంబూరు పీర్ పావు జెట్టీ దగ్గర రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఈ పావురాన్ని పట్టుకున్నారు. దీనికి  రెండు ఉంగరాలు తగిలించి ఉండటంతో అనుమానం వచ్చి పట్టేశారు. రాగి, అల్యూమినియం రంగు రింగ్స్ ఈ పావురం(Spy Pigeon )కాలికి కట్టి ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది.

We’re now on WhatsApp. Click to Join

పావురం రెక్కల కింది భాగంలో చైనీస్ లో సందేశం రాసి ఉందని పోలీసులు కూడా గుర్తించారు. దీంతో ఈ పావురంపై అప్పట్లో ఆర్సీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దీనిపై విచారణ పూర్తయింది. క్లీన్ చిట్ లభించడంతో పావురంపై నమోదు చేసిన  గూఢచర్యం కేసును ఎత్తేశారు.  కేసు దర్యాప్తులో ఈ పావురం చైనాది కాదని..  తైవాన్ కు చెందినదని తేలింది.  ఆ పావురం తైవాన్‌లో ఉండగా వాటర్ రేసింగ్ పోటీల్లో వాడేవారని నిర్ధారణ అయింది. తైవాన్‌లో జరిగిన వాటర్ రేసింగ్ పోటీల సందర్భంగానే ఈ పావురం తప్పిపోయి సరిహద్దు దాటి భారత్‌కు వచ్చేసిందని గుర్తించారు. ఈ పావురాన్ని విడుదల చేయడానికి పోలీసులు “నో ఆబ్జెక్షన్” సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ప్రస్తుతం  ఈ పావురం పరిస్థితి బాగానే ఉందని అంటున్నారు.

Also Read :Coconut Semiya Payasam: ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి సేమియా పాయసం.. సింపుల్గా ఇంట్లోనే చేసుకోండిలా?

చెక్ బౌన్స్‌ కేసులో మాజీ క్రికెటర్ అరెస్ట్

చెక్ బౌన్స్‌ కేసులో భారత మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్యపై పోలీసులు బుధవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరడంతో సొంత పూచీకత్తుపై విడుదల అయ్యారు. ‘‘ప్రశాంత్ వైద్య స్థానిక వ్యాపారి నుంచి స్టీల్‌ను కొనుగోలు చేసి చెక్‌ ఇవ్వగా అది చెల్లలేదు. డబ్బు చెల్లించాలని ప్రశాంత్‌ని కోరగా అతడు నిరాకరించాడు. దీంతో వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. విచారణకు హాజరుకావాలని కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ అతడు పట్టించుకోకపోవడంతో నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ అయింది. దీంతో పోలీసులు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలు విన్న కోర్టు పూచీకత్తుతో విడుదల చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది ’’ అని బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విఠల్‌సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. ప్రశాంత్ వైద్య ప్రస్తుతం విదర్భ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  అతడు 1995-96 కాలంలో భారత్‌ తరఫున నాలుగు వన్డేలు ఆడాడు.