Site icon HashtagU Telugu

Sachin Amazed: సూర్య కొట్టిన ఆ ఒక్క షాట్ కి సచిన్ ఫిదా.. వీడియో వైరల్!

Sachin

Sachin

స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. తన అద్భుతమైన స్కై షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపిస్తున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో సంచలన ఇన్సింగ్స్ ఆడి ముంబైను గెలిపించాడు. అయితే ముంబయి-గుజరాత్ సందర్భంగా సూర్య బ్యాటింగ్ చూస్తూ సచిన్ రియాక్షన్ ఇచ్చారు. సూర్య కొట్టిన ఆ ఒక్క షాట్ కి సచిన్ ఫిదా అయిపోయారు. గుజరాత్ పై తాజా మ్యాచ్ లో గెలిచిన ముంబయి, ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది.

ఈ మ్యాచ్ లో ముంబయి గెలవడానికి కారణం సూర్యకుమార్. ఎందుకంటే మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. మనోడు మాత్రం 49 బంతుల్లో 103 పరుగులు చేసి విజయానికి కారణమయ్యాడు. దీంతో ముంబయి 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులతో పాటు సచిన్ కూడా సూర్య బ్యాటింగ్ కి ఫిదా అయిపోయాడు. అవును మీరు విన్నది నిజమే. ముంబయి బ్యాటింగ్. 18.1 ఓవర్ సందర్భంగా షమి బౌలింగ్ చేస్తున్నాడు.

అప్పటికే 40 బంతుల్లో 73 రన్స్ తో ఉన్న సూర్య.. తన గేర్ మార్చి రెడీగా ఉన్నాడు. షమి వేసిన బంతిని చాలా నీట్ గా స్లైస్ చేశాడు. దీంతో అదికాస్త స్టాండ్స్ పడింది. సిక్స్ అయింది. అయితే ఈ షాట్ చూసి స్టేడియంలో ఉన్నవాళ్లకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక సచిన్ కూడా ఇలా కట్ చేశాడు! అనేలా చేతులతో చూపిస్తూ కనిపించారు. ఆ వీడియో, ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

Also Read: 198 Fishermen: పాక్ జైలు నుంచి 198 మత్స్యకారులు విడుదల, భారత్ కు అప్పగింత

Exit mobile version