Site icon HashtagU Telugu

Surya Shani Gochar : 4 రాశులకు అదృష్టం.. తండ్రీకొడుకుల్లాంటి ఆ గ్రహాల ఎఫెక్ట్

Surya Shani Gochar

Surya Shani Gochar

సూర్యుడు, శని గ్రహాలు జూన్‌ నెలలో ఒకే టైంలో తమ కదలికలను మార్చుకోబోతున్నాయి. ఈ రెండు గ్రహాలూ తిరోగమన దశలోకి (Surya Shani Gochar) రాబోతున్నాయి. ఇటువంటి సందర్భానికి జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడు, శని గ్రహాల మధ్య తండ్రి-కొడుకుల సంబంధం ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే  ఏకకాలంలో ఈ ఇద్దరి సంచారం (Surya Shani Gochar) అన్ని రాశులనూ ప్రభావితం చేస్తుందని అంటారు. సూర్యుడు జూన్ 15 న సాయంత్రం 06.07 గంటలకు మిథునరాశిలో తిరోగమనంలోకి వస్తాడు. ఇక శనిగ్రహం జూన్ 17న రాత్రి 10.48 గంటలకు కుంభరాశిలో తిరోగమనంలో ఉంటుంది. ఈ విధంగా శని, సూర్యుడు కలిసి ఒకే టైంలో తిరోగమనంలో ఉండటం వల్ల ఏర్పడే ప్రభావం కొన్ని రాశులపై సానుకూలంగానూ.. కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. మిథున రాశి

ఆ టైంలో మిథున రాశి వారికి పనిచేసే రంగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన విజయాలు లభిస్తాయి. మీరు మీ ఖర్చులను కూడా కంట్రోల్ చేసుకుంటారు. దీని కారణంగా మీ జీవితంలో సమతుల్యత వస్తుంది. వృత్తిపరంగా మీరు మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి లాభం, పురోగతిని పొందుతారు. ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని అనుకునే వారి కోరికలు నెరవేరుతాయి. మీరు మీ కుటుంబ జీవితాన్ని కూడా ఆనందిస్తారు. ఈ సమయంలో మీరు శుభవార్తలను వినే ఛాన్స్ కూడా ఉంటుంది.

2. సింహ రాశి 

సింహరాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. మీరు ఆస్తి ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. ఈ టైంలో వ్యాపారస్తులు లాభపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మతపరమైన పనులలో పాల్గొనడం ఈ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో సామాజికంగా మీ ఇమేజ్  బలోపేతం అవుతుంది.

Also read : Sunset: సూర్యాస్తమయం సమయంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ వెంటే?

3. కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ టైం మంచిది. మీ జీవితంలోనే బెస్ట్ టైం గా ఇది మారుతుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. మీకు విజయాలు దక్కుతాయి. విద్యార్థులు కూడా సక్సెస్ అవుతారు. మీ సహోద్యోగుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. అయినప్పటికీ, మీ ఖర్చులలో కొంచెం పెరుగుదల ఉండొచ్చు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  ఎందుకంటే ఈ ఖర్చులు.. మీ పనులను ఆపలేవు.

4. మకర రాశి 

మకర రాశి వారు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ పని, కెరీర్ కు సంబంధించిన కొన్ని ప్రయోజనాలు కలగొచ్చు. మీ ప్రయత్నాలలో మీ తండ్రి లేదా తండ్రి లాంటి వ్యక్తుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. తోబుట్టువుల పూర్తి మద్దతు దక్కుతుంది. మీ ఆదాయ ప్రవాహం బాగానే ఉంటుంది. ఈ టైంలో మీరు ఖర్చులు, పొదుపులను జాగ్రత్తగా చూసుకోవాలి.

(గమనిక: ఈ కథనంలో ఉన్న సమాచారం ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని సమాచారంగా మాత్రమే తీసుకోవాలి.)