AAP : జూన్‌ 2న లొంగిపోతా..ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్‌ సందేశం

  • Written By:
  • Publish Date - May 31, 2024 / 03:11 PM IST

Delhi CM Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కు సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన మధ్యంతర బెయిల్‌(Interim bail) రేపటితో ముగియనుంది. దీంతో జూన్‌ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులు, ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్‌ కీలక సందేశాన్నిచ్చారు. మధ్యంతర బెయిల్‌ ముగియడంతో జూన్‌ 2న లొంగిపోనున్నట్లు తెలిపారు. లొంగిపోయేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరనున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందొద్దని ఈ సందర్భంగా తన మద్దతుదారులకు సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈ సమయంలో మీకు ఒక హామీ ఇస్తున్నాను. మీకు అందుతున్న సేవల్లో ఎలాంటి మార్పు ఉండదు. త్వరలో నా తల్లులు, సోదరీమణులకు రూ.1,000 అందుతాయి. ఒక కుమారుడిలా నేను మీకోసం పనిచేశాను. ఈరోజు మీకొక అభ్యర్థన చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి” అని కోరారు. అంతేకాక ఈసారి ఎంతకాలం జైలులో ఉంటానో తెలియదు. నియంతృత్వం నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు నేను జైలుకు వెళ్తున్నాను. అందుకు గర్వంగా ఉంది.

Read Also: T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో టాప్ 5 ఆటగాళ్లు వీళ్ళే

కేజ్రీవాల్‌ను లిక్కర్‌ పాలసీ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.