MLCs Appointment Case : గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకం పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే అమలులో ఉంటుందని ఈ మేరకు ధర్మాసనం పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
తమ నియామకాన్ని పక్కన పెట్టి, కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థాన విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడం ప్రభుత్వ విధి అని ధర్మాసనం పేర్కొంది.
అనంతరం విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం, గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Also: Natural Star Nani : టైర్ 1 కి సరిపోయే కంటెంట్..!
కాగా, గవర్నర్ కోటా కింద శాసన మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వం దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా.. నాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించలేదు. ఈ ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో నాటి కేసీఆర్ సర్కారు నిర్ణయాన్ని తిరస్కరించారు. ఈలోగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం.. బీఆర్ఎస్ సర్కార్ ఓడి.. కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీనికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.