రాఖీపూర్ణిమ (Rakshbhandan) పర్వదినాన నేడు ఆకాశం (Sky)లో అద్భుతం (Amazing) జరగబోతుంది. ఆకాశంలో అరుదైన సూపర్ బ్లూ మూన్ (Super Blue Moon) నేడు కనిపించనుంది. అందమైన చందమామ మరింత ఆకర్షణీయంగా, అందంగా కనువిందు చేయనుంది. రీసెంట్ గా శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. బుధుడు, యురేనస్, గురుగ్రహం, నైప్యూటర్, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూసే అద్భుత అవకాశం కలిగింది. ఈ క్రమంలోనే నేడు మరో అరుదైన దృశ్యం సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతున్నది.
ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్ (Blue Moon) అని అంటారు. చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్‌లో ఏర్పడగా మళ్లీ 2032, 2037 ఆగస్టులో ఏర్పడబోతున్నది. నేడు సూపర్ బ్లూ మూన్ (Super Blue Moon) కనిపించబోతుంది. బ్లూ మూన్ అంటే నిజంగా బ్లూ కలర్‌లో ఉండదు. ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది.
Read Also : Pragyan Rover Detects Oxygen : చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఆక్సిజన్ ఉన్నట్లు కనుగొన్న ప్రజ్ఞాన్ రోవర్
నేడు కనిపించే నిండు చంద్రుడు సూపర్ మూన్ , బ్లూ మూన్ కూడా. సూపర్ మూన్ అంటే సాధారణంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కన్నా 16 శాతం కాంతి వంతంగా, సాధారణం కంటే పెద్దగా కనిపిస్తాడు. చంద్రుడు పరిభ్రమించ కక్ష్య భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, అదే సమయంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఇలా సూపర్ మూన్ కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే సూపర్ మూన్ ఈ ఏడాదిలో మూడో అతిపెద్ద సూపర్ మూన్. బుధవారం కనిపించే చందమామ చాలా కాంతివంతంగా, ఆకర్షణీయంగా, నారింజ రంగులో కనిపించబోతోంది.
మాములుగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ (Super Moons) ఏర్పడుతుంటాయి.. కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్ ( Blue Moon) మాత్రం అరుదైనది. సాధారణంగా 25% పౌర్ణమి చంద్రుళ్లు సూపర్ మూన్ లుగా మారుతాయి. కానీ కేవలం 3% పౌర్ణమి చంద్రుళ్లు మాత్రం బ్లూ మూన్ గా మారుతాయి. చంద్రుడు (Moon) భూమి (Land) కి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి వస్తే, ఆ రోజు చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. ఈరోజు సాయంత్రం 7.10 గంటల తరువాత ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ ప్రారంభం మొదలవుతుంది. హిందూ సంప్రదాయంలో ఒకే నెలలో సంభవించే రెండు పున్నములకు ప్రాధాన్యం ఉన్నది. ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని తిలకించాలని.. మళ్లీ తొమ్మిది సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
Read Also : Google Flights – Cheaper Tickets : చౌకగా ఫ్లైట్ టికెట్స్.. ‘గూగుల్ ఫ్లైట్స్’ సరికొత్త ఫీచర్
అలాగే చంద్రుడిని చూసే సమయంలో శనిగ్రహం కూడా కనిపించే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఆ సమయంలో ఇది చంద్రుడికి దగ్గరగా వస్తుందని తెలిపారు. బైనాక్యులర్ లేదా టెలిస్కోప్‌తో చూస్తే వీక్షకులకు గ్రహం ఆనవాళ్లు కాస్త మంచిగా కనిపించే అవకాశం ఉందని తెలిపారు. శనివారం రోజు శని గ్రహం నేరుగా సూర్యుడికి ఎదురుగా వస్తుందని, ఆదివారం రాత్రి వరకు అలా సూర్యుడికి ఎదురుగా శనిగ్రహం ఉంటుందని, సూర్యకాంతి గ్రహంపై పడినప్పుడు కాస్త ప్రకాశవంతంగా, పెద్దగా కనిపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సరే ఏదైతేమ్ మీరంతా సూపర్ బ్లూ మూన్ ను చూసి ఎంజాయ్ చెయ్యండి.