అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్‌మోర్ (Butch Wilmore) లు ఇప్పట్లో రావడమే కష్టమే అని తెలుస్తుంది. జూన్ 5 న భూకక్ష్యకు 400 కిలోమీటర్లు ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. జూన్ 14న వారు భూమికి రావాల్సి ఉండగా.. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యతో వారు భూమిపైకి రావడం వాయిదాపడుతూ వస్తున్నది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని థ్రస్టర్, హీలియం వ్యవస్థలు సరిగ్గా పనిచేయక పోవడం వల్ల వారు రాలేకపోతున్నారు. యుద్ధ ప్రతిపదికన భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా కృషి తీవ్రంగా కస్టపడుతుంది. కానీ ఇప్పట్లో వారు భూమి మీదకు రావడం కష్టమే అని నాసా తేల్చి చెప్పింది. సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు రానున్నట్లు నాసా తెలిపింది. ఒకవేళ బోయింగ్ స్టార్ లైనర్ సురక్షితం కాదని భావిస్తే స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా తీసుకొస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన స్పేస్ఎక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
సునీతా విలియమ్స్ ను భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా (NASA) చేయబోయే పని ఏంటి అంటే..
స్టార్‌లైనర్ వ్యోమనౌక సాంకేతిక లోపాన్ని సరిదిద్దలేకపోతే, NASA సెప్టెంబర్‌లో దాని క్రూ-9 మిషన్ కింద స్పేస్-X డ్రాగన్ క్యాప్సూల్ నుండి ISSకి 4 మందికి బదులుగా 2 వ్యోమగాములను మాత్రమే పంపుతుంది. క్రూ-9 మిషన్ ఫిబ్రవరిలో ముగిసినప్పుడు, ఈ డ్రాగన్ క్యాప్సూల్ సహాయంతో, నాసా విలియమ్స్, విల్మోర్‌లను తిరిగి భూమికి తీసుకువస్తుంది. ఈ దశ NASA ప్రణాళిక, దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై NASA కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ.. “బోయింగ్ స్టార్‌లైనర్‌లో బుచ్, సునీతలను తిరిగి తీసుకురావడం మా ప్రధాన ఎంపిక. అయినప్పటికీ, మేము ఇతర ఎంపికలను తెరిచి ఉంచడానికి అవసరమైన ప్రణాళికను చేసాము. మేము Space-Xతో పని చేస్తున్నాము. బోయింగ్ స్టార్‌లైనర్ సాంకేతిక సమస్య కారణంగా, NASA దాని క్రూ-9 మిషన్‌ను ఆలస్యం చేయాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటె అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ దంపతులకు కొన్ని శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్పేస్ లో గుర్వతాకర్షణ బలం సున్నాగా ఉండటంతో వారు బరువు తగ్గి కండరాలు,ఎముకల పై ప్రభావం పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. కాలక్రమేణా, కండరాల ఫైబర్స్ బలహీనపడతాయి. ఎముక కూడా బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంటుంది. రోజంతా అంతరిక్షంలో ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు మసకబారుతుందని, డబుల్ విజన్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
Read Also : Bhadrachalam Floods : భారీ వర్షాలకు భద్రాద్రి ఆలయ కల్యాణమండపం నేలమట్టం