Solar storm: సూర్యుడు బ్లాస్ట్ అవుతాడా? పెద్దపెద్ద గుంటలు అందుకే ఏర్పడ్డాయా..?

సూర్యుడిలో ఏదో జరుగుతోంది.

  • Written By:
  • Updated On - December 4, 2022 / 09:03 AM IST

సూర్యుడిలో ఏదో జరుగుతోంది. సూర్యుడి మధ్యలో గత కొద్ది రోజులుగా పెద్దపెద్ద నల్లగుంటలు ఏర్పడుతున్నాయి. చూడటానికి ఇవి పెద్దపెద్ద లోయలను తలపించేలా అత్యంత లోతుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. సూర్యుడిపై పడిన పెద్దపెద్ద నల్లగుంటలు ఎంత భారీ సైజులో ఉన్నాయంటే.. ఒక్కో దానిలో భూమి సైజున్న ఎన్నో భూములు ఇమిడిపోతాయట.దీన్నిబట్టి ఆ నల్లగుంటల సైజుపై ఒక అంచనాకు రావచ్చు. టెక్నికల్ గా ఈ నల్లగుంటలను శాస్త్రవేత్తలు కరోనల్ హోల్ అని పిలుస్తున్నారు. ఈ కరోనల్ హోల్స్ నుంచి  వేడి వేడి సోలార్ వేవ్ (సౌర పవనాలు) చాలా వేగంగా బయటకు వస్తున్నాయి. ఈ సోలార్ వేవ్స్ ప్రభావం మరో 2 రోజుల్లో భూమిపై పడే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ధ్రువ ప్రాంతాల్లో ఆ లైట్లు వెలుగుతాయి..

పెద్దపెద్ద నల్లగుంటల వైపు సూర్యుని అయస్కాంత రేఖలు బలంగా ఉంటాయి. వీటి కారణంగా గుంటల లోపల ఉన్న సౌర పదార్థాలు వేగంగా బయటకు ప్రవహిస్తున్నాయి. ఈవిధంగా గుంతల నుంచి వెలువడుతున్న సౌర తుపాను వేగం గంటకు 2.90 కోట్ల కిలోమీటర్లుగా ఉంది. ఈ సోలార్ వేవ్ వల్ల తీవ్రమైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఆల్ఫా కణాలు ఉద్భవిస్తాయి. భూమి యొక్క అయస్కాంత శక్తి ఈ సౌర తుఫానుతో ప్రభావితమయ్యే ఛాన్స్ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే అది అంత ఈజీగా జరగదని.. ఈక్రమంలో సౌర తరంగాలు మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం మధ్య యుద్ధం జరుగుతుంది. దీనిని జియో మాగ్నెటిక్ స్టార్మ్ అని పిలుస్తారు. భూమి యొక్క రెండు ధ్రువాల వద్ద వాతావరణం సన్నగా ఉంటుంది. అక్కడి నుంచి సౌర తరంగాలు భూమి వాతావరణాన్ని చీల్చివేసి లోపలికి చొచ్చుకు వచ్చే గండం ఉంటుంది . అటువంటి పరిస్థితిలో భూమి ధ్రువ ప్రాంతాల్లో రంగురంగుల లైట్లు కనిపిస్తాయి. వీటినే నార్తర్న్ లైట్స్ అని పిలుస్తారు. అమెరికాలోని మిచిగాన్, యూరప్ లోని మాయన్ ప్రాంతాల గగన తలంలో నార్తర్న్ లైట్లు కనిపించే ఛాన్స్ఉంది.

గుంతలు ఎప్పుడు ఏర్పడ్డాయి ?

భారతదేశంలో ఛత్ పండుగ జరుపుకుంటున్న సమయంలో సూర్యుడిపై ఈ గుంటలలో మొదటిది ఏర్పడింది. అప్పటి నుంచి వరుసగా నాలుగైదు సార్లు ఈ గుంతలు ఏర్పడ్డాయి.ఇటీవలి ఒక గొయ్యి 2022 నవంబర్ 30 న కనిపించింది. మరో రెండు రోజుల్లో ఈ గొయ్యి ప్రభావం భూమిపై ఉండనుంది.

భూమిపై ఏం జరుగుతుంది ?

సాధారణంగా సూర్యుడి నుంచి వచ్చే తుఫానులు భూమిని చేరుకోవడానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతుంది. కానీ ఇది చాలా తీవ్రంగా ఉన్నప్పుడు జరుగుతుంది. బలహీన స్థాయి తుఫాను ఉంటే, అది చేరుకోవడానికి 24 నుండి 30 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 2019 డిసెంబర్ లో ప్రారంభమైన 11 ఏళ్ల సౌర చక్రం కొనసాగుతోంది. అంతకుముందు సూర్యుడు ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు సూర్యుడిలో ఏదో అలజడి మొదలైంది.  సూర్యుడిపై ఏర్పడిన పెద్దపెద్ద నల్లగుంటల కారణంగా భూమి వైపు వస్తున్న సౌర తుపాను ‘జి-1’ గ్రేడ్ కు చెందింది. అంటే దీనివల్ల పెద్దగా భూమికి ప్రమాదం లేదు. కానీ భూమిపై ఉండే పవర్ గ్రిడ్లు, భూమికి కమ్యూనికేషన్ అవసరాలు తీరుస్తున్న కొన్ని ఉపగ్రహాలు ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు.

సౌర చక్రం నేపథ్యం..

సౌర చక్రంపై శాస్త్రవేత్తల పర్యవేక్షణ 1775లో మొదలైంది. సూర్యుని కార్యకలాపాలు చాలా వరకు 2025 సంవత్సరంలో జరుగుతాయని నమ్ముతారు. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర తుఫాను 1895లో నమోదైంది. దీనిని కారింగ్టన్ ఈవెంట్ అంటారు. ఒక మెగాటన్ పవర్‌తో 1000 కోట్ల అటామ్ బాంబ్‌లకు సమానమైన శక్తి విడుదలైంది.