Site icon HashtagU Telugu

Chimpanzees : చింపాంజీలు, బోనోబోల మెమొరీ పవర్‌పై సంచలన నివేదిక

Chimpanzees

Chimpanzees

Chimpanzees : మనుషుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరినైనా చూస్తే చాలాకాలం పాటు వారి ముఖాలను గుర్తుంచుకోగలరు. మరి మనుషుల్లాగే బాడీ ల్యాంగ్వేజీని కలిగి ఉండే చింపాజీల(Chimpanzees) పరిస్థితేంటి ? వాటికి మెమొరీ పవర్ ఇంతగా ఉంటుందా ? ఎవరినైనా చూస్తే ఎక్కువ కాలం గుర్తుంచుకోగలవా ?  అనే ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ అమెరికా సంస్థ ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అధ్యయనం చేసింది. ఈ స్టడీలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చింపాంజీలకు, చింపాజీలలాగే ఉండే బోనోబోలకు మెమోరీ పవర్ ఎక్కువని అధ్యయనంలో తేలింది. ఇవి ఎవరినైనా ఒకసారి చూస్తే.. 26 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత కూడా గుర్తుపట్టగలవని వెల్లడైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ అధ్యయనంలో భాగంగా చింపాంజీలు, బోనోబోలకు  ఐ ట్రాకింగ్ పరీక్ష చేశారు. తమకు పూర్వ పరిచయమున్న చింపాంజీలు, బోనోబోలు కలిసినప్పుడు.. అవి వాటిని ఎక్కువసేపు చూసిన తర్వాత గుర్తుపడుతున్నాయని స్టడీ రిపోర్టులో ప్రస్తావించారు. దీన్నిబట్టి గతంలో పరిచయం ఉన్నవారు కలిస్తే.. గతాన్ని నెమరువేసుకునే శక్తి చింపాంజీలు, బోనోబోలకు ఉందని నిర్ధారణ అయింది. ఇక ఇదే సమయంలో తమ జాతిలోని కొత్త సభ్యులు కనిపించినప్పుడు.. చింపాంజీలు, బోనోబోలు చాలా తక్కువ టైంపాటు వాటి ముఖం వైపు చూస్తున్నాయని గుర్తించారు. మనుషులు చిన్న వయస్సు నుంచే ఇతరుల ముఖాలను బాగా చూస్తుంటారు. వారి ముఖాలను గుర్తుంచుకునేందుకు ట్రై చేస్తుంటారు. అచ్చం ఇదే తరహా లక్షణం చింపాంజీలలోనూ కనిపించిందని శాస్త్రవేత్త డాక్టర్ లారా లూయిస్ పేర్కొన్నారు.

Also Read: White Paper – History : వైట్ పేపర్.. శ్వేతపత్రం.. వందేళ్ల చరిత్ర

చింపాంజీలు, బోనోబోల జాతులు చూడటానికి ఒకేలా ఉంటాయి. కానీ చింపాంజీల కంటే బోనోబోలు బలహీనమైనవి. బోనోబోల హైట్ కూడా తక్కువ. ఈ రెండు జీవ జాతులు వాటి సమూహాలతో కలిసి ఏ విధంగా జీవిస్తాయి ? తోటి జీవులను ఎలా గుర్తుపడతాయి ? అనే దానికి ఎట్టకేలకు సమాధానం లభించింది. వీటికి సమాధానం.. చింపాంజీలు, బోనోబోల మెమొరీ పవర్‌లోనే ఉందని తేలిపోయింది.