2,40,000 Nanoplastics : మనమంతా నిత్యం ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ తాగుతుంటాం. వాటర్ బాటిళ్ల సేల్స్ ఎల్లప్పుడూ జోరుగా సాగుతుంటాయి. ప్రత్యేకించి జర్నీ టైంలో మనం తప్పనిసరిగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తుంటాం. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై తాజాగా సంచలన అధ్యయన నివేదిక ఒకటి వచ్చింది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. ఒక లీటర్ (33 ఔన్సులు) ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో సగటున 2.40 లక్షల నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. ఈ అధ్యయనంలో భాగంగా వాటర్ బాటిల్స్‌లో 1 మైక్రోమీటర్ కంటే తక్కువ పొడవున్న నానోప్లాస్టిక్స్ ఎంత మోతాదులో ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నానో ప్లాస్టిక్ కణాలు 5వేలలోపే ఉంటాయని గతంలో వెలువడిన నివేదికలు చెప్పగా.. ఆ సంఖ్య అంతకంటే 100 రెట్లు ఎక్కువే ఉంటుందని తాజా నివేదిక తేల్చి చెప్పింది. ఈమేరకు వివరాలతో కూడిన నివేదిక ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో(2,40,000 Nanoplastics) సోమవారం పబ్లిష్ అయింది.
We’re now on WhatsApp. Click to Join.
ప్లాస్టిక్‌లలో చిన్నసైజులో ఉండేవి మైక్రోప్లాస్టిక్స్.. అతిచిన్న సైజులో ఉండేవి నానోప్లాస్టిక్స్. నానోప్లాస్టిక్స్ మానవ ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగిస్తాయి. ఎందుకంటే అవి మానవ రక్త కణాలలోకి చొచ్చుకుపోయేంత చిన్నవి. రక్తప్రవాహంలోకి కూడా అవి ఈజీగా ప్రవేశించి మన శరీర అవయవాల పనితీరును ప్రభావితం చేయగలవు. గర్భిణులు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో నీటిని తాగితే.. ఈ నానోప్లాస్టిక్‌లు మాయ ద్వారా పుట్టబోయే పిల్లల శరీరాలకు కూడా చేరగలవని అధ్యయన నివేదిక పేర్కొంది.
Also Read: IAS Aravind Kumar : కారు రేసులకు అనుమతిలేకుండా నిధులు.. ఐఏఎస్ అరవింద్‌కు మెమో
పేపర్ కప్పులలో టీ తాగుతున్నారా?
వాడి పారేసే పేపర్ కప్పులలో టీ తాగుతున్నారా? అయితే మీరు మీ జీవిత ఆయుష్షును చేజేతులా విసిరి పారేసుకుంటున్నట్లే. ఈ విషయం ప్రఖ్యాత ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. డిస్పోజబుల్ పేపర్ కప్పులలో టీ అందించడం పరిపాటి అయింది. అయితే ఈ పద్థతిలో తేనీటి సేవనం ఏకంగా ప్లాస్టిక్ పదార్థాలను శరీరంలోకి చొప్పించుకోవడమే అవుతుందని అధ్యయనంలో స్పష్టం అయింది. ఏ వ్యక్తి అయినా రోజుకు మూడు సార్లు డిస్పోజబుల్ కప్‌లలో టీ తాగితే వారి కడుపులోకి ఎంత లేదన్నా 75000 సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్ రేణువులు చేరుతాయి. మనిషిని ప్లాస్టిక్ విషపూరితం చేసి, ఆరోగ్యాన్ని గుల్ల చేసే ఈ ముప్పు గురించి ఐఐటి ఖరగ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయల్ తెలిపారు. ఆమె ఆధ్వర్యంలోనే దీనిపై అధ్యయనం జరిగింది.