Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

ఒకే బ్లాక్ బోర్డుపై.. హిందీ, ఉర్దూ రెండు క్లాసులూ చెబుతున్నారు. దీంతో ఏ క్లాస్ ను వినాలో.. ఏ క్లాస్ ను చూడాలో తెలియక విద్యార్థులు ఆగమాగం అవుతున్నారు. ఈ దుస్థితి బీహార్ లోని కటిహార్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆదర్శ్ మిడిల్ స్కూల్ లో నెలకొంది.

  • Written By:
  • Publish Date - May 18, 2022 / 07:00 PM IST

ఒకే బ్లాక్ బోర్డుపై.. హిందీ, ఉర్దూ రెండు క్లాసులూ చెబుతున్నారు. దీంతో ఏ క్లాస్ ను వినాలో.. ఏ క్లాస్ ను చూడాలో తెలియక విద్యార్థులు ఆగమాగం అవుతున్నారు. ఈ దుస్థితి బీహార్ లోని కటిహార్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆదర్శ్ మిడిల్ స్కూల్ లో నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే బ్లాక్ బోర్డు పై ఏక కాలంలో రెండు పాఠాలు ఎలా చెబుతారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇలా చేయడం వల్ల విద్యార్థులు ఏ ఒక్క సబ్జెక్టు నూ సక్రమంగా వినలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.” మా పాఠశాల లో తరగతి గదులు తగిన సంఖ్యలో లేవు. 2017 లో సమీపంలోని ఉర్దూ ప్రైమరీ స్కూల్ ను కూడా మా బడిలోనే కలిపేశారు. అప్పటి నుంచి తరగతి గదులు లేక ఉర్దూ, హిందీ క్లాస్ లు ఒకేసారి నిర్వహిస్తున్నాం” అని పాఠశాల అసిస్టెంట్ టీచర్ కుమారి ప్రియాంక మీడియాకు చెప్పారు. దీనిపై మీడియా వర్గాలు కటిహర్ జిల్లా విద్యాధికారిని వివరణ కోరగా.. ఇలా రెండు తరగతులు ఒకేసారి నిర్వహించడం మంచిది కాదన్నారు. ఉర్దూ తరగతుల నిర్వహణ కోసం త్వరలో ఒక ప్రత్యేక గదిని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. కొందరు ఈ వీడియోపై వెటకారం గా కామెంట్స్ చేస్తూ.. ” ఇలా చదివితే మల్టీ టాస్కింగ్ వస్తుంది” అని పేర్కొన్నారు. “గంగ జమున తెహజీబ్ కనిపిస్తోంది” అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “సెక్యులర్ స్కూల్” అని మరొకరు కామెంట్ పెట్టారు.