Site icon HashtagU Telugu

9 Days In Cave : 3,600 అడుగుల లోతులో 9 రోజులు ఇరుక్కుపోయాడు.. కట్ చేస్తే !!

Man Fell In Cave

Man Fell In Cave

9 Days In Cave : టర్కీలో ఉన్న ప్రపంచంలోనే లోతైన గుహ ‘మోర్కా’ !! ఆ గుహ కొలతలను తీసుకునేందుకు, లోపలి నిర్మాణాన్ని చూసేందుకు సాహసం చేసి దిగిన అమెరికన్ పర్వతారోహకుడు మార్క్ డిక్కీ ఇరుక్కుపోయాడు. 3,695 అడుగుల లోతున్న ఆ గుహలోకి దిగనైతే దిగాడు. కానీ దిగిన తర్వాత అతడి ఆరోగ్యం దెబ్బతింది. బాగా ఎత్తు నుంచి దిగే క్రమంలో బాడీపై ఒత్తిడి పెరిగి.. శరీర భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగింది.  దీంతో మళ్లీ గుహ పైకి ఎక్కే స్టెమినా బాడీలో లేకుండా పోయింది. దీంతో సెప్టెంబరు 2న గుహలోకి వెళ్లి ఇరుక్కున్న 40 ఏళ్ల మార్క్ డిక్కీ.. ఎట్టకేలకు ఇవాళ (మంగళవారం) పైకి రాగలిగాడు. అతడు గుహలో ఇరుక్కున వారం తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది.

Also read : President Kim Jong Un: రష్యాకు రైలులో వెళ్లిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్..!

మార్క్ డిక్కీని గుహ నుంచి బయటకు తేవడానికి టర్కీ ప్రభుత్వం శాయశక్తులు ఒడ్డింది.  తొలుత ఒక వైద్యుడిని మెడికల్ కిట్ తో గుహ లోపలికి పంపించి మార్క్ వైద్యచికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆ వైద్యుడు.. మార్క్ డిక్కీ శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్, రక్తాన్ని అందించారు. గత మూడు రోజులుగా జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో 8 దేశాలకు చెందిన 190 మంది నిపుణులు పాల్గొన్నారు. ఇందుకోసం బల్గేరియా, క్రొయేషియా, హంగరీ, ఇటలీ, పోలాండ్ నుంచి ప్రత్యేక వైద్యులు, పారామెడిక్స్, అనుభవజ్ఞులైన కేవర్లు టర్కీకి వచ్చారు. తనను రక్షించిన రెస్క్యూ టీమ్‌లకు, టర్కీ ప్రభుత్వానికి మార్క్ (9 Days In Cave)  కృతజ్ఞతలు తెలిపాడు.