Site icon HashtagU Telugu

Viral Pic : బిగ్ బి లాగే ఉన్న ఆఫ్ఘన్ శరణార్ధి….నెట్టింట్లో వైరల్..!!

Amitabh Bachchan

Amitabh Bachchan

ఆప్ఘనిస్తాన్ కు చెందిన ఓ శరణార్ధుడు అచ్చం బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాగే ఉన్నాడంటూ 2018లో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడా ఫొటో మరోసారి తెరపైకి వచ్చింది. ఆ ఫొటో చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అప్పట్లో ఆ ఆప్ఘానిస్తాన్ శరణార్థి ఫొటోను ఓ ప్రముఖ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఇప్పటికీ ఆ ఫొటో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. అచ్చం అమితాబ్ లాంటి పొలికలతోనే ఉన్న ఆ ఆప్ఘన్ పౌరుడిని చూసి నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

కొందరు ఆ ఫొటో చూసి అతడిని అమితాబ్ అనుకుంటున్నారు. మరికొందు అమితాబ్ తన నెక్ట్స్ మూవీ కోసం తీయించున్న స్టిల్ అని భావిస్తున్నారు. ఇంకొందరు గులాబో సితాబో మూవీ నుంచి బిగ్ బి అని కొందరు…థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో అమితాబ్ ఫొటో అని మరికొందరు పొరపడ్డారు. మొత్తానికి ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో మరోసారి చర్చకు దారితీసింది.

Exit mobile version