Site icon HashtagU Telugu

Boy Friend On Rent: అద్దెకు బాయ్ ఫ్రెండ్ కావాలా.. అయితే ఈ వెబ్‌సైట్ చూడండి..!

Boy Friend For A Rent

Boy Friend For A Rent

Boy Friend On Rent: ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్‌ ఉండటం కామన్. కానీ అమ్మాయిల‌, అబ్బాయిల మ‌ధ్య ఏదో ఒక్క కార‌ణంతో బాయ్ ఫ్రెండ్ దూరం పెట్ట‌వ‌చ్చు. ఇలా బాయ్ ఫ్రెండ్ దూరం పెట్ట‌డాన్ని చాలా మంది అమ్మాయిలు త‌ట్టుకోలేరు. మ‌నోవేద‌న‌కు గురువుతుంటారు. అలాంటి వారి కోస‌మే గంటల ఆధారంగా మీకు న‌చ్చిన‌ బాయ్‌ ఫ్రెండ్‌ను అద్దెకు ఇస్తామంటూ బెంగళూరులో కొందరు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

‘టాయ్ బాయ్’ పేరుతో రూపొందిన ఈ వెబ్‌సైట్ ద్వారా బాయ్ ఫ్రెండ్స్‌ను అద్దెకిస్తారంటా. అయితే.. ఈ బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిలతోపాటు బయటికి రావ‌టం కుద‌ర‌దు. సినిమాలు, షాపింగ్, రెస్టారెంట్లు వంటి వాటికి తీసుకెళ్దామంటే అస‌లే కుదరదు. ఈ అద్దె బాయ్ ఫ్రెండ్ కేవలం ఫోన్ లేదా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అమ్మాయిల‌కు అందుబాటులో ఉంటాడు. వ్యక్తిగతంగా ఎవరినీ కలవడు. అమ్మాయిలు మానసిక వేదన, ఒత్తిడిలో ఉంటే.. వారితో ఫోన్ మాట్లాడతాడు. అమ్మాయిల సమస్యను విని, వాళ్ల ఆందోళనను తొలగించేందుకు ప్రయత్నం చేస్తాడ‌ని పోర్టల్‌ను అభివృద్ధి చేసిన కౌశల్‌ ప్రకాశ్‌ తెలిపారు. దీనికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. గంటల పరంగా ఛార్జీ చేస్తారని తెలుస్తోంది.

అయితే ప్రేమలో విఫలమైన యువతులకు ఉద్దేశించి ‘టాయ్‌ బాయ్‌’ పేరుతో అబ్బాయిలను అద్దెకు (ఫోన్ లో మాత్రమే) ఇస్తామనడమే కాస్త వివాదాస్పదంగా మారింది. ఈ సైట్ మీద, సేవల మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఇలాంటి సేవలు పలు దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.