Site icon HashtagU Telugu

Gujarat : దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి నిదర్శనం ఇదే..

Thermax Company

Thermax Company

ప్రతి ఏడాది దేశంలో కొన్ని లక్షల మంది తమ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ వేట మొదలుపెడుతున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఆ రీతిలో లేవు. దీంతో దేశ వ్యాప్తంగా నిరుద్యోగం అనేది పెరిగిపోతుంది. తమ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకక..ఏదోకటి చేద్దాం అనుకున్న దానికి కూడా పోటీ విపరీతంగా ఉండడం తో చాలామంది రోడ్డు పక్కన పలు పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మరికొంతమంది ఉద్యోగాలు లేక , రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఎక్కడైనా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే చాలు వాటికోసం భారీగా సంఖ్యలో వెళ్తుంటారు. కొన్ని సార్లు జాబ్ మేళా సందర్భంలో వచ్చే నిరుద్యోగుల సంఖ్యను చూస్తే.. వామ్మో ఇంత మంది నిరుద్యోగులు ఉన్నారా అని ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా ఓ వీడియో దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతే కాదు సోషల్ మీడియా లో వైరల్ గా కూడా చక్కర్లు కొడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

గుజరాత్ లోని ఝగాడియాలో గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రంగా థెర్మాక్స్ గ్లోబల్ అనే సంస్థ (Bharuch Hotel as Hundreds Turn up for Job Interview) పని చేస్తుంది. ఈ సంస్థ అంక్లేశ్వర్ లో ఓ హోటల్ లో పది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు (Just 10 Vacant Positions) నిర్వహించింది. ఈ పది ఉద్యోగాల కోసం వందలాది మంది అభ్యర్థులు ఇంటర్వూకి హాజరుకావడం షాక్ కు గురి చేసింది. ఈ ఇంటర్వ్యూకి 1800 మంది రావడం జరిగింది. అంతేకాక లోపలికి వెళ్లేందుకు క్యూ పద్ధతి పాటించకపోవడంతో వారి మధ్య తోపులాట జరగడం.. ఈ తోపులాటలో హోటల్‌ ముందు ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ ఊడిపోవడం, పలువురు కింద పడి గాయాలు కావడం జరిగింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

బీజేపీ పాలిత గుజరాత్‌లో నిరుద్యోగం ఎలా తాండవిస్తుందో చూడండి అంటూ తన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. ఇదేనా గుజరాత్‌ మోడల్‌ అంటూ విమర్శలు గుప్పించింది. గుజరాత్‌ రాష్ట్రంలోని నిరుద్యోగాన్ని ప్రస్తుత ప్రభుత్వం దేశం మొత్తం వ్యాప్తి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

Read Also : Nandamuri Mokshagna : మోక్షజ్ఞ సినిమాకి దర్శకుడు, నిర్మాత సెట్ అయ్యారంట.. ఎవరో తెలుసా..?