PM Modi: శంకరాచార్య కొండను చూసే అవకాశం కలిగిందిః ప్రధాని మోడీ

  • Written By:
  • Updated On - March 7, 2024 / 01:30 PM IST

 

PM Modi: ఈరోజు శ్రీనగర్‌(Srinagar)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)పర్యటిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ కశ్మీర్​లోయలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.6400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్ట్‌లను మోడీ ప్రారంభించనున్నారు.

పర్యటనలో భాగంగా శ్రీనగర్‌ (Srinagar) చేరుకోగానే శంకరాచార్య కొండ (Shankaracharya Hill)ను మోడీ దర్శించుకున్నారు. అక్కడి కొండపై ఉన్న శంకరాచార్య ఆలయాన్ని దూరం నుంచి చూస్తూ నమస్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. దూరం నుంచే ఈ కొండపై ఉన్న శంకరాచార్య ఆలయాన్ని చూసే అవకాశం లభించిందంటూ మోడీ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మోడీ పాల్గొనే సభ వేదిక 2 కిలోమీటర్ల పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జీలం నది, దాల్ సరస్సులో మెరైన్ కమాండోలను మొహరించారు.

read also : Janasena : జనసేన పోటీ చేసే సీట్ల జాబితా..?