Viral Video :విద్యార్థిని కాలుతో త‌న్నిన లెక్చ‌ర‌ర్‌.. కాలేజీకి నోటీసులు ఇచ్చిన ఇంట‌ర్ బోర్డ్‌

విజ‌య‌వాడ శ్రీ చైత‌న్య క‌ళాశాల‌లో ఓ లెక్చ‌ర‌ర్ అత్యూత్స‌హాం ప్ర‌ద‌ర్శించాడు...

  • Written By:
  • Updated On - September 17, 2022 / 09:12 PM IST

విజ‌య‌వాడ శ్రీ చైత‌న్య క‌ళాశాల‌లో ఓ లెక్చ‌ర‌ర్ అత్యూత్స‌హాం ప్ర‌ద‌ర్శించాడు. విద్యాబుద్ధులు చెప్పవలసిన మాస్టారు విద్యార్థి చెంపపై కొడుతూ.. కాళ్లతో తన్నిన సంఘటన వైరల్ గా మారింది. ఈ సంఘ‌ట‌న శ్రీ చైతన్య భాస్కర్ భవన్ తాడిగడప క్యాంపస్ లో జ‌రిగింది. లెక్చ‌ర‌ర్ సదరు విద్యార్థి చెంపలపై కొడుతూ.. కాళ్లతో తన్నిన దృశ్యాలను వీడియో తీసిన‌విద్యార్థులు.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై చైతన్య కాలేజ్ భాస్కర్ భవన్ క్యాంపస్ కు ఇంట‌ర్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఇంటర్ విద్యార్థిని లెక్చరర్ కాలితో తన్నుతూ వైరల్ అయిన వీడియోపై ఏపీ ఇంటర్ బోర్డ్ స్పందించింది. కాలేజీ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఐదు రోజుల్లో చెప్పాలని నోటీసులో పేర్కొంది. దాడి చేసిన లెక్చరర్ వివరాలు సేకరించామని.. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ విద్యామండలి జాయింట్ సెక్రటరీ కృష్ణారావు పేర్కొన్నారు.