Site icon HashtagU Telugu

Sreeleela : బాలయ్య తో మరోసారి సందడి చేయబోతున్న శ్రీలీల

Sreeleela Balakrishna

Sreeleela Balakrishna

డాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) మరోసారి బాలకృష్ణ (Balakrishna)తో సందడి చేయబోతుంది. గతంలో భగవత్ కేసరి మూవీ లో శ్రీలీల..బాలకృష్ణ కూతురిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి బాలకృష్ణ తో షేర్ చేసుకోబోతుంది. కాకపోతే ఇది సినిమాలో కాదు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో(unstoppable with nbk season 4 )లో.

ప్రముఖ OTT ఛానల్ ఆహా లో అన్‌స్టాపబుల్ షో విత్ బాలకృష్ణ ప్రోగ్రాం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా..తాజాగా నాల్గో సీజన్ మొదలైంది. ఈ నాల్గో సీజన్ మొదటి ఎపిసోడ్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని షో హైప్ తెచ్చాడు. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ పాల్గొని ఇంకాస్త హైప్ తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఈ షో లో శ్రీలీల హాజరైంది. దీనికి సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. స్లీవ్‌ లెస్‌ టాప్‌, చీరకట్టులో క్యారవాన్‌ ముందు నిల్చున్న ఆమె స్టిల్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆమె ఎపిసోడ్ తాలూకు ప్రోమో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

శ్రీలీల (Sree Leela) ..అంటే డాన్స్ ఐకాన్ అని ఎవరైనా అనాల్సిందే. మొదటి సినిమా నుండి మొన్నటి గుంటూరు కారం వరకు ఏ సినిమాలోనైనా డాన్స్ చించేసింది. కానీ సినిమాలే ఆ రేంజ్ లో చించలేకపోయాయి. ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ..ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. అతి తక్కువ టైములో ఎక్కువ సినిమాలు చేసిన భామగా గుర్తింపు తెచ్చుకుంది కానీ వాటిలో ఏ మూవీ కూడా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకంటే ముందే అల్లు అర్జున్ (Allu Arjun) తో చిందులేసిన పుష్ప 2 (Pushpa 2)రాబోతుంది. పుష్ప 2 లో ఐటెం సాంగ్ లో బన్నీ తో కలిసి చిందులేసింది. ఇద్దరు టాలెంటెడ్ డాన్సర్లు కలిసి స్టేజీ మీద డ్యాన్స్ వేస్తుంటే చూడాలని అభిమానులు , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు.

Read Also : CM Revanth Reddy Request: బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎక‌రాలు బదిలీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డి విన‌తి!