Sravan Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్‌రావు నాలుగోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నేడు ఆయన ఫోన్లలోని డేటాను అధికారులు రీట్రీవ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఆయన్ను విచారించారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాని వల్ల జరిగిన లబ్ధిపై అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రవణ్‌రావు ఇచ్చిన వివరాలను బట్టి భవిష్యత్తులో కొందరు రాజకీయ నేతలను విచారించే అవకాశం ఉంది. గతేడాది మార్చి 29న శ్రవణ్‌రావు విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈక్రమంలో పలుమార్లు సిట్ విచారణకు హాజరయ్యారు.
Read Also: Bhubharathi : రేవంత్ తీసుకొచ్చిన భూ భారతి.. రైతులకు లాభమా..? నష్టమా..?
కాగా, శ్రవణ్‌కుమార్ గతంలో సిట్ విచారణకు హాజరైనప్పుడు ఫోన్‌ను సమర్పించాలని దర్యాప్తు అధికారులు ఆదేశించారు. అనంతరం ఆయన ఫోన్ తెచ్చినప్పటికీ అందులో ఏ సమాచారమూ లేకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. ఈక్రమంలో నేడు ఫోన్లలోని డేటాను అధికారులు సేకరిస్తున్నారు. ఇక, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులోస్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) దర్యాప్తు అంతా శ్రవణ్‌రావు వినియోగించిన సెల్‌ఫోన్ల చుట్టే తిరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎస్‌ఐబీ, ఎస్‌ఓటీ మాజీ చీఫ్ ప్రణీత్ రావుకు చేరవేసిన సమాచారం రాబట్టేందుకు సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
ప్రస్తుతం ఫోన్‌ట్యాపింగ్ కేసులో స్మార్ట్‌ఫోన్లు కీలకంగా మారాయి. మొదట్లో సిట్‌దర్యాప్తుకు కొంత మేర సహకరించినట్లు నటించిన శ్రవణ్‌రావు..గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన సెల్‌ఫోన్లను అప్పగించేందుకు ఎత్తులు వేస్తున్నాడు. సిట్‌ఆదేశాల మేరకు తన 2 ఫోన్లతో శ్రవణ్‌రావు హాజరుకావాల్సి ఉంది. కానీ తాను సర్వేలో అందించిన సమాచారం మినహా వాట్సప్ చాటింగ్స్, ఇతర ఆధారాలు లభించకుండా ఉండేందుకే తన సెల్‌ఫోన్లను శ్రవణ్‌రావు అప్పగించడం లేదని సిట్ అనుమానిస్తున్నది.
Read Also: Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందో తెలుసా?