Vicky Donor: వీర్యదానంలో ‘బ్రిటన్’ వాసి రికార్డ్… ఇప్పటికే 129 మందికి జననం… టార్గెట్ 150..!!!

ప్రపంచంలో ఎక్కడైనా సరే... ఏ జంటకైనా సరే... వారు తల్లిదండ్రులు అవ్వాలని కోరుకుంటారు. ఎన్నో కలలు కంటారు. అయితే కొంతమంది దంపతులకు మాత్రం ఆ అవకాశం రాదు. అందుకు వైఫ్ అండ్ హస్బండ్ లో ఏ ఒక్కరికి ప్రాబ్లం ఉన్నా...

  • Written By:
  • Updated On - January 29, 2022 / 01:02 PM IST

ప్రపంచంలో ఎక్కడైనా సరే… ఏ జంటకైనా సరే… వారు తల్లిదండ్రులు అవ్వాలని కోరుకుంటారు. ఎన్నో కలలు కంటారు. అయితే కొంతమంది దంపతులకు మాత్రం ఆ అవకాశం రాదు. అందుకు వైఫ్ అండ్ హస్బండ్ లో ఏ ఒక్కరికి ప్రాబ్లం ఉన్నా… వారి కల నెరవేరదు. మహిళలకు గర్బసంచి లేకపోయినా.. పీరియడ్స్ లో సమస్యతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా వారు గర్భం దాల్చలేరు. అలానే కొన్ని జంటల్లో భర్తలో లోపం… అంటే తగినంత వీర్యకణాల సంఖ్య లేకపోయినా సరే… వాళ్లు తండ్రి కాలేరు. అలాంటి సందర్భాల్లోనే వారు టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు వారికి ఎవరో ఒకరు స్పర్మ్ డొనేట్ చేయాల్సి ఉంటుంది. భార్యాభర్తల అంగీకారం మేరకే ఇలాంటివి కొన్ని క్లినిక్ లు కొంతమేర చార్జ్ వసూలు చేసి, వారి కోరికని నెరవేరుస్తాయి. అయితే అలా వీర్యాన్ని దానం చేసేవాళ్లు ఎంతోకొంత డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కానీ, వరల్డ్ లోనే ఒకాయన… ఒక్క రూపాయి కూడా అడగకుండా 129 మందికి జన్మనిచ్చాడు. మొత్తం తన టార్గెట్ 150 మంది పిల్లలు అని చెబుతున్నాడు. ఇంతకీ ఎవరాయన..? ఏంటా స్టోరీ అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే హ్యాష్ ట్యాగ్ యు ప్రత్యేక కథనాన్ని చదవండి.

బ్రిటన్ కు చెందిన 66 ఏళ్ల క్లివ్ జోన్స్ అనే వీర్యదాత, వీర్య దానంలో పలు రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే పలువురికి ఆయన తన వీర్యాన్ని డొనేట్ చేశాడు. క్లివ్ జోన్స్ ద్వారా ఇప్పటికే 129 మంది పిల్లలు జన్మించారు. ఇది ప్రపంచంలోనే ఒక రికార్డుగా చెప్పొచ్చు. రీసెంట్ గా ఆయనను యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన పలు న్యూస్ చానళ్లు ఇంటర్వూ చేశాయి. అందులో ఆయన ఎమన్నారో ఇప్పుడు ఆయన మాటల్లోనే చూద్దాం. నేను బాగా సక్సెస్ అయిన వీర్య దాతను. ప్రస్తుతానికి నేను 138 మంది బేబీలకు తండ్రిని. ఇప్పటికే 129 మంది నేను చేసిన వీర్య దానం ద్వారా జన్మను పొందారు. మరో 9 మంది ఆయా తల్లుల గర్భంలో ఉన్నారు. నేను మరికొన్నేళ్ల పాటు నా వీర్యదాన కార్యక్రమాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను.

మొత్తంమీద 150 మంది బేబీల లక్ష్యాన్ని చేరుకోవాలని సంకల్పించాను… చేరుకుంటాను కూడా అంటూ… బ్రిటన్ కు చెందిన క్లివ్ జోన్స్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మరోవైపు క్లినిక్ లు, వీర్య వర్తకులకు నా కంటే ఎక్కువ సంఖ్యే ఉండొచ్చు. కానీ, వారు దాతలు మాత్రం కాదు. వాళ్లు వీర్యాన్ని విక్రయిస్తుంటారు. నేను మాత్రం అలా విక్రయించను. నేను ఇదంతా కూడా ఉచితంగానే చేస్తున్నా. కాకపోతే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పెట్రోల్ కోసం కొంత తీసుకుంటాను అని క్లివ్ జోన్స్ తెలిపాడు. తన ద్వారా సంతానం కలిగిన తల్లులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పంపించే మెసేజ్ లు, బేబీల ఫొటోలను చూస్తే ప్రజలు మరింతగా నన్ను అర్థం చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కొంతమందికి పిల్లలను కలిగి ఉండడం అనేది ఎంతో ముఖ్యమైన విషయంగా క్లివ్ జోన్స్ చెప్పుకొచ్చాడు. పిల్లల్లేని వారి దుస్థితి గురించి నేను వార్తా పత్రికల్లో చాలాసార్లు చదవివాను. సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్ ద్వారా అంగీకారాలు కుదుర్చుకోవడం గురించి తెలుసుకున్నాను. దాంతో సాయం చేయాలని తలంచి నేను కూడా ఒక పోర్టల్ లో పోస్ట్ పెట్టాను. దాంతో డెర్బీ నుంచి ఒక మహిళ నన్ను మొదటిసారి సంప్రదించింది. అంతే.. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రకటనలు ఇచ్చిందే లేదు. కాకపోతే, నేడు తనని ఎంతోమంది సంప్రదిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు ఈ స్పర్మ్ డోనార్ క్లివ్ జోన్స్.