Site icon HashtagU Telugu

Fastest Racer: అడ్డంకులు అధిగమిస్తూ.. రేసింగ్ లో దూసుకుపోతూ..!

Women Racer

Women Racer

తన చుట్టుపక్కల పిల్లలు సైకిళ్లు తొక్కడం నేర్చుకుంటున్న సమయంలో.. తొమ్మిదేళ్ల కళ్యాణి పోటేకర్ బైక్ రేసింగ్‌పై ఇష్టం పెంచుకుంది. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత భారతదేశపు అత్యంత వేగవంతమైన మహిళా మోటార్‌ సైకిల్ రేసర్‌గా అవతరించింది. రేసింగ్ ఎన్నో రికార్డులు తిరగరాస్తూ తనకంటూ పేరుతెచ్చుకుంది.

కల్యాణి కుటుంబం పారాగ్లైడింగ్, స్కీయింగ్ లాంటి సాహస క్రీడలను పరిచయం చేశారు. కానీ ఈమెకు బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయంలో తన తండ్రి తనకు స్ఫూర్తిగా నిలిచారని అంటోంది. ఆయన సాయంతో యమహా RX100 బైక్ నడపడం నేర్చుకోవడమే కాకుండా.. 12వ తరగతి బోర్డు పరీక్షల తర్వాత Yamaha FZ 150 బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు.

తండి సహకారంతో 2017లో కాలిఫోర్నియా సూపర్‌బైకింగ్ స్కూల్‌లో శిక్షణ పొందిన కళ్యాణి ఆ తర్వాత JK టైర్స్ సూపర్‌బైక్ కప్‌లో 600ccలో జరిగింది. అయితే ఆ పోటీల్లో అందరూ పురుషులే పాల్గొన్నారు. కానీ మొదటిసారి ఓ యువతి పాల్గొనడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. కొందరు కళ్యాణిని అవమానించారు కూడా. ఆ తర్వాత థాయ్‌లాండ్, తైవాన్‌లలో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి, పురుష-ఆధిపత్య క్రీడలో పోటీదారుగా నిలిచి తన తానేంటో నిరూపించుకుంది. ఫలితంగా దేశంలోని ‘మోటార్‌స్పోర్ట్ గవర్నింగ్ బాడీ అయిన ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా’ (FMSCI)చే మోటార్‌ స్పోర్ట్స్ విభాగంలో అత్యుత్తమ మహిళా విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.