Site icon HashtagU Telugu

Sonusood : రైలు డోర్ వద్ద కూర్చొని ప్రయాణించిన సోను సూద్..

Sonusood Train Door

Sonusod

సినీ నటుడు సోనూసూద్ (Sonusood) కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. కదులుతున్న ట్రైన్ (Train) లో డోర్ (Door) వద్ద కూర్చున్న వీడియో అది. ఈ వీడియోపై కొందరు నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వీడియోలు ప్రమోట్ చేయడం సరికాదని చెపుతున్నారు. ఎంతో మందికి స్పూర్తి దాతగా ఉన్న మీరు ఇలా చేయవద్దని కోరుతున్నారు. మరికొందరు సోనూసూద్ (Sonusood) పై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ముంబై రైల్వే పోలీసులు (Police) కూడా స్పందించారు. ‘సోనూ సూద్ ఫుట్ బోర్డ్ మీద ప్రయాణించడం సినిమాల్లో అయితే ఎంటర్టైన్ మెంట్ గా ఉంటుంది. నిజ జీవితంలో కాదు’ అని వ్యాఖ్యానించారు.

Also Read:  Choreographer : ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య