Site icon HashtagU Telugu

Jajpur: మద్యం మత్తులో తండ్రి ముక్కును కొరికిన కుమారుడు

jail

jail

జైపూర్ లోని జాజ్‌పూర్ జిల్లాలోని రౌతరాపూర్ గ్రామంలో మద్యం మత్తులో తన తండ్రి ముక్కును కొరికాడు కొడుకు. అంతేకాదు మరో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినందుకు 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బిభూతి సమాల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బిభూతి రాత్రి తాగి ఇంటికి వచ్చి తన పొరుగువారిపై దుర్భాషలాడడం ప్రారంభించాడు.

అతని ప్రవర్తనను అతని తండ్రి శత్రుఘ్న వ్యతిరేకించడంతో, తండ్రీ కొడుకుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత, బిభూతి, కోపంతో, శతృఘ్నను కొట్టడం ప్రారంభించాడు. అతని ముక్కును కూడా కొరికాడు. శతృఘ్న కేకలు విన్న అతని ఇరుగుపొరుగు ఇద్దరు సంఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ బిభూతి వారిపై కూడా దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు జాజ్‌పూర్‌ రోడ్డు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బిభూతిని పట్టుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు జాజ్‌పూర్‌ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. నిందితుడిని మంగళవారం స్థానిక కోర్టులో హాజరుపరిచి, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు జాజ్‌పూర్ రోడ్ పోలీస్ స్టేషన్ ఐఐసి ఉపేంద్ర కుమార్ ప్రధాన్ తెలిపారు.